ముస్లిం కోటా రిజర్వేషన్లపై రాజకీయ ప్రకటనలు సరికావు - సుప్రీంకోర్టు

By Asianet News  |  First Published May 9, 2023, 1:29 PM IST

కర్ణాటక ముస్లిం కోటా రిజర్వేషన్లపై రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందని పేర్కొంది. పలువురు రాజకీయ నాయకుల చేసిన ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు, రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రజాప్రతినిధులు చేసిన ప్రకటనలపై సుప్రీంకోర్టు మంగళవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. అది కోర్టు పరిధిలో ఉన్న అంశమని, దానిపై రాజకీయ ప్రకటనలు చేయకూడదని సూచించింది.

ఫస్ట్ పీరియడ్స్ రక్తం చూసి.. ఎవరితోనో సెక్స్ లో పాల్గొందనే అనుమానంతో చెల్లెలిని హతమార్చిన అన్న..

Latest Videos

ఓబీసీ జాబితాలో ముస్లింలకు 4 శాతం కోటాను తొలగిస్తూ కర్ణాటక రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమిత్ షా సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రజాప్రతినిధులు ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న అంశాలను రాజకీయం చేయవద్దని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ కేసును విచారించిన జస్టిస్ నాగరత్న.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని, సుప్రీంకోర్టు ప్రక్రియకు పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. 4 శాతం ముస్లిం కోటాను రద్దు చేయడాన్ని సవాలు చేసిన పిటిషనర్ల తరఫున సీనియర్ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ‘‘4 శాతం ముస్లిం కోటాను ఉపసంహరించుకున్నామని ప్రతీ రోజూ హోం మంత్రి కర్ణాటకలో ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేయాలి?’’ అని ప్రవ్నించారు.

భార్యతో విడాకులు తీసుకున్న భర్త.. సంతోషంలో బంగీ జంప్, రోప్ తెగిపోవడంతో..

అయితే కర్ణాటక ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలేవీ తనకు తెలియవని, మత ప్రాతిపదికన కోటా ఉండకూడదని ఎవరైనా చెబుతుంటే తప్పేంటని, అది వాస్తవమని అన్నారు.

సొలిసిటర్ జనరల్ కోర్టులో స్టేట్ మెంట్ ఇవ్వడం సమస్య కాదని, అయితే కోర్టు వెలుపల ఉన్న అంశంపై కొందరు మాట్లాడటం సరికాదని జస్టిస్ జోసెఫ్ అన్నారు. 1971 లో కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా విలేకరుల సమావేశం నిర్వహించినందుకు ఒక రాజకీయ నాయకుడిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైందని గుర్తు చేశారు. 

ప్రతీ కన్నడిగుడి కల నాదే.. - ప్రధాని మోడీ.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో వీడియో సందేశం విడుదల..

కాగా.. గత నెలలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చే నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసి, వీరశైవ-లింగాయత్ లు, వొక్కలిగలు అనే రెండు ఆధిపత్య వర్గాలకు బదిలీ చేసింది. ఓబీసీ ముస్లింలను 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గం (ఈడబ్ల్యూఎస్) కేటగిరీకి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

click me!