ప్రతీ కన్నడిగుడి కల నాదే.. - ప్రధాని మోడీ.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో వీడియో సందేశం విడుదల..

By Asianet News  |  First Published May 9, 2023, 12:36 PM IST

కర్ణాటక ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణల్లో కర్ణాటక నంబర్ వన్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. 


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసిన ఆ వీడియోలో ‘‘ప్రతీ కన్నడిగుడి కల నా సొంత కల. మీ సంకల్పమే నా సంకల్పం.’’ అని అన్నారు.  దేశ ఆర్థిక వ్యవస్థలో కర్ణాటక పాత్రను ప్రస్తావిస్తూ.. ‘‘భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలోనే భారత్ ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచేలా చూడాలి. కర్ణాటక ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందినప్పుడే ఇది సాధ్యమవుతుంది’’ అని అన్నారు.

ఫస్ట్ పీరియడ్స్ రక్తం చూసి.. ఎవరితోనో సెక్స్ లో పాల్గొందనే అనుమానంతో చెల్లెలిని హతమార్చిన అన్న..

Latest Videos

కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం 3.5 సంవత్సరాల పాలనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ‘‘బీజేపీ ప్రభుత్వ నిర్ణయాత్మక, కేంద్రీకృత, భవిష్యత్తు విధానం కర్ణాటక ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదం చేస్తోంది. కరోనా సమయంలోనూ కర్ణాటక బీజేపీ నాయకత్వంలో ఏటా రూ.90 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అయితే గత ప్రభుత్వాల హయాంలో కర్ణాటకకు ఏటా సుమారు రూ.30 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇది కర్ణాటక యువత పట్ల బీజేపీ నిబద్ధత’’అని ప్రధాని పేర్కొన్నారు.

PM Shri 's appeal to the voters of Karnataka. pic.twitter.com/lrXMuL7kHF

— BJP (@BJP4India)

‘‘నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, గ్రామాలు, నగరాలలో జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, మహిళలు, యువతకు కొత్త అవకాశాలను సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం అత్యంత విధేయతతో పనిచేస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

భార్యతో విడాకులు తీసుకున్న భర్త.. సంతోషంలో బంగీ జంప్, రోప్ తెగిపోవడంతో..

పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణల్లో కర్ణాటక నంబర్ వన్ గా నిలవాలని ఆ వీడియోలో ప్రధాని ఆకాంక్షించారు. విద్య, ఉపాధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లో కర్ణాటక నంబర్ వన్ గా నిలవాలని అన్నారు. వ్యవసాయంలో కూడా కర్ణాటకను నంబర్ వన్ గా నిలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. కర్ణాటక వారసత్వాన్ని, సాంస్కృతిక సామర్థ్యాన్ని తాము గౌరవించామని తెలిపారు. కర్ణాటకను నెంబర్ వన్ గా తీర్చిదిద్దినందుకు మే 10న బాధ్యతాయుతమైన పౌరులుగా అందరూ ఓటు వేయాలని కోరారు. 

ఎంఎస్ ధోనీ తమిళనాడు దత్తపుత్రుడు.. ఆయనకు నేను పెద్ద అభిమాని - సీఎం ఎంకే స్టాలిన్

కాగా.. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్-సెక్యులర్ (జేడీఎస్) ఓటర్లను తమ వైపు ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి. దీని కోసం అనేక వాగ్దానాలు ఇచ్చాయి. మొత్తంగా ఒకే దశలో అన్ని స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజారిటీ మార్కు 113 సీట్లను సాధించాల్సి ఉంటుంది. 

click me!