భారత ప్రధాని మోదీ అయితే.. రంగు రంగుల దుస్తుల్లో.. నుదిటన బొట్టు పెట్టుకొని మరీ కనిపించడం విశేషం.
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ.. ఇప్పటి వరకు చాలా కార్యక్రమాల్లో పాల్గొనే ఉంటారు. దేశ సంబంధిత విషయాల కోసం.. ఇతర దేశాలకు కూడా వెళ్లారు. కానీ.. ఆయన ఎప్పుడైనా ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఎప్పుడైనా చూశారా..? అది కూడా ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ లో. నిజానికి మోదీ దాదాపు ఎప్పుడైనా కుర్తానే ధరిస్తారు. విదేశాలకు వెళ్లిన సమయంలో.. సూట్ ధరించడం చూశాం. కానీ.. రంగురంగుల దుస్తులు ధరించి.. ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేయడం చూశారా..? మోదీ ఫ్యాషన్ షోకి వెళ్లి ర్యాంప్ వాక్ చేశారా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. ఆయన నిజంగా చేయలేదు. అదంతా ఏఐ చేసిన ఓ అద్భుతం.
తాజాగా.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్ , ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడీయా ప్లాట్ ఫామ్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్.. ఓ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో.. మోదీ ర్యాప్ వాక్ చేస్తూ కనిపించడం గమనార్హం.
undefined
అయితే.. కేవలం భారత ప్రధాని మోదీ మాత్రమే కాదు.. చాలా మంది ప్రపంచ నేతలు ఉండటం విశేషం. అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ట్రంప్, చైనా అధినేత గి జిన్ పింగ్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జొంగ ఉన్, పోప్ ప్రాన్సిస్ లతో పాటు.. ఎలన్ మస్క్ కూడా ఉన్నారు. భారత ప్రధాని మోదీ అయితే.. రంగు రంగుల దుస్తుల్లో.. నుదిటన బొట్టు పెట్టుకొని మరీ కనిపించడం విశేషం.
కాగా..ఎలన్ మస్క్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒబామా అయితే.. పలు రకాల దుస్తులు మారుతూ కనిపించారు. నిజానికి వీళ్లందరూ ఒకేసారి కనిపించడమే చాలా అరుదు. అలాంటిది.. ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించడం మాత్రం.. కలలో కూడా జరిగే పని కాదు. కానీ.. దానిని ఏఐ( ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) చాలా సింపుల్ గా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
High time for an AI fashion show pic.twitter.com/ra6cHQ4AAu
— Elon Musk (@elonmusk)