క్రౌడ్ స్ట్రైక్ ఔటేజ్ కారణంగా లక్షలాది మైక్రోసాఫ్ట్ పరికరాలు ప్రభావితమైనట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అన్ని విండోస్ మెషీన్‌లలో ఒక శాతం కంటే తక్కువగా ప్రభావితమై ఉంటాయని అంచనా వేసింది.
సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు సంబంధించిన గ్లోబల్ టెక్ అంతరాయం దాదాపు 8.5 మిలియన్ మైక్రోసాఫ్ట్ పరికరాలను ప్రభావితం చేసినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ మేరకు ఒక బ్లాగ్‌లో తెలిపింది. ‘క్రౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా 8.5 మిలియన్ విండోస్ పరికరాలను ప్రభావితం చేసిందని మేము ప్రస్తుతం అనుకుంటున్నాం. లేదా అన్ని విండోస్ మెషీన్‌లలో ఒక శాతం కంటే తక్కువగా ప్రభావితమై ఉంటాయని అంచనా వేస్తున్నాం’’ అని మైక్రోసాఫ్ట్ బ్లాగ్‌లో పేర్కొంది.
‘‘మైక్రోసాఫ్ట్ అజూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిష్కారాన్ని వేగవంతం చేయడంలో సహాయపడే స్కేలబుల్ సొల్యూషన్‌ను అభివృద్ధి చేయడంలో క్రౌడ్ స్ట్రైక్ సహాయపడింది. అమెజాన్ వెబ్ సేవలు, గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ రెండింటితో కలిసి అత్యంత ప్రభావవంతమైన విధానాలకు సహకరించడానికి టెక్ దిగ్గజం పనిచేసింది’’ పేర్కొంది.
కాగా, బ్యాంకుల నుంచి మీడియా కంపెనీల వరకు అనేక పరిశ్రమలను ఈ టెక్ అంతరాయం ప్రభావితం చేసింది. విమానాశ్రయాలు, విమానయాన సంస్థల సేవల్లోనూ అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికులు చెక్ ఇన్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెక్ ఇన్‌లో జాప్యాలు, పలుచోట్ల విమానాల రద్దుతో లక్షలాది మంది అసౌకర్యానికి గురయ్యారు.