యువకులను ఆసుపత్రిలో బంధించి.. కర్రలతో కొట్టిన నర్సులు.. బీహార్ లో దారుణం..

Published : Oct 19, 2022, 09:42 AM IST
యువకులను ఆసుపత్రిలో బంధించి.. కర్రలతో కొట్టిన నర్సులు.. బీహార్ లో దారుణం..

సారాంశం

హాస్పిటల్ కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడి పరిస్థితులను చూసి వీడియో తీయడం మొదలు పెట్టారు. ఇది గమనించిన నర్సులు వారిద్దరినీ గదిలో బంధించి తీవ్రంగా కొట్టారు.

బీహార్ : ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై వీడియో తీసిన ఇద్దరు యువకులను గదిలో బంధించి నర్సు, సిబ్బంది తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది.  ఓ నర్సు ఇద్దరు యువకులను కర్రతో కొడుతుండగా.. మరో నర్స్  ఆమె పక్కనే ఉన్నారు. తమను కొట్టొద్దని యువకులు ప్రాదేయ పడుతున్నప్పటికీ వారిని నర్సు కొడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బీహార్ లోని సరన్ జిల్లా ఛప్రా ఆసుపత్రికి ఇద్దరు యువకులు మెడికల్ సర్టిఫికెట్ కోసం వెళ్లారు. అయితే అక్కడ నెలకొన్న పరిస్థితులపై తన ఫోన్ లో వీడియో తీయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన నర్సులు, ఆసుపత్రి సిబ్బంది వారిని ఓ గదిలో బంధించారు. తర్వాత కర్రలతో కొట్టారు. ఫోన్లలో తీసిన వీడియోలను డిలీట్ చేయాలని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

భార్య కాపురానికి రావడం లేదనీ.. అత్త కుటుంబాన్ని సజీవ దహనం చేసిన దుర్మార్గుడు

దీంతో పలువురు నెటిజన్లు బీహార్ ఆరోగ్య శాఖకు వీడియోను ట్యాగ్ చేస్తూ ఈ ఘటన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మరికొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ యువకులు నర్సులతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆస్పత్రి సిబ్బంది చేసింది సబబేనని పేర్కొన్నారు.

#MohammadShami #ManishSisodia #INDvsAUS #BiharPolice #Bihar
Sadar bazar hospital Chapra Bihar. two youths capturing improper hospital facility on video, taken hostage by 2 nurses pooja and sakshi,beaten with rod for 4 hours. No FIR registered. Why?
Hospital denies.@NitishKumar pic.twitter.com/4xEMW18aFO
— Saurabh Bahuguna46 (@bahuguna46) October 17, 2022

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌