థరూర్ వర్సెస్ ఖర్గే.. సోనియా గాంధీ తరువాత సీటును అధిష్టించేదెవరు ? నేడే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు..

Published : Oct 19, 2022, 09:03 AM ISTUpdated : Oct 19, 2022, 09:04 AM IST
థరూర్ వర్సెస్ ఖర్గే.. సోనియా గాంధీ తరువాత సీటును అధిష్టించేదెవరు ? నేడే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు..

సారాంశం

ఇద్దరు సీనియర్ నేతలలో ఎవరు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాబోతున్నారనే విషయం మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. నేడు ఆ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

137 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నేడు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. గడిచిన 24 ఏళ్లలో గాంధీయేతర మొదటి అధ్యక్షుడు ఎవరో నేడు తేలబోతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ నిలిచారు. వారిలో ఒకరిని ఎన్నుకునేందుకు అక్టోబర్ 17వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 9,500 మందికి పైగా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరోసారి సాంకేతిక కారణాలతో అకాసా ఫ్లైట్ రద్దు.. ప్రయాణికుల ఆందోళన..

కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం చీఫ్ గా పనిచేసిన సోనియా గాంధీ వారసులుగా ఎవరు ఉండాలన్నది నిర్ణయించడానికి అక్టోబర్ 17వ తేదీన జరిగిన ఎన్నికలు రెండు దశాబ్దాలలో కీలకమైనవి. ఆ పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చివరి సారిగా 2000లో నవంబర్ లో ఎన్నికలు నిర్వహించారు. అందులో సోనియా గాంధీ చేతిలో జితేంద్ర ప్రసాద ఓడిపోయారు. రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన 2017- 2019 మధ్య రెండేళ్లు మినహా 1998 నుండి ఆమె అధ్యక్షురాలిగా కొనసాగారు. 

తాజా ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు ముందు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 68 పోలింగ్ బూత్ల నుంచి సీల్డ్ బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆ బాక్సులను పార్టీ కార్యాలయంలోని ‘‘స్ట్రాంగ్ రూమ్’’లలో ఉంచారు. వాటిని అభ్యర్థుల ఏజెంట్ల ముందు తెరుస్తారు. బ్యాలెట్ పత్రాలను వారి ముందే పదేపదే కలుపుతారు.

భారత్ కు చేరుకున్న ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్.. మూడురోజుల పర్యటన

ఖర్గే కు గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటు ఆయనకు అనేక మంది సీనియర్ నాయకుల మద్దతు ఉంది. దీంతో ఆయనకే అధ్యక్ష పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ థరూర్ తనను తాను మార్పునకు అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠగా మారింది. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగిందని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అన్నారు. రహస్య బ్యాలెట్ లో పార్టీ చీఫ్ ను ఎన్నుకోవడానికి ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేసిన మొత్తం 9,915 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులలో 9,500 మందికి పైగా పీసీసీ కార్యాలయాలు, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని మిస్త్రీ సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో చెప్పారు.

అమెరికా కొరియర్‌లో రూ. 40 కోట్ల డ్రగ్స్.. ఇద్దరి అరెస్ట్..

కాగా తాను పార్టీ అధ్యక్షుడైతే పార్టీ నాయకులు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని సంస్థాగత విషయాలపై సంప్రదిస్తానని ఎన్నికలకు ముందు తెలిపారు. అయితే శశి థరూర్.. ఖర్గేకు మద్దతు ఇస్తున్న కొందరు సీనియర్ నాయకులపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. కాగా.. మరి కొన్ని గంటల్లో దేశంలోని పురాతన పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారనే విషయం తేలిపోనుంది.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu