టపాసు కాల్చి... కింద పడి ముఖం పగలకొట్టుకున్న ఎమ్మెల్యే.. వైరల్ వీడియో..!

Published : Oct 19, 2022, 09:36 AM IST
టపాసు కాల్చి... కింద పడి ముఖం పగలకొట్టుకున్న ఎమ్మెల్యే.. వైరల్ వీడియో..!

సారాంశం

ఆ సమయంలో ఆయన చేసిన ఓ పొరపాటు.. ఆయన కింద పడేలా చేసింది. ఈ క్రమంలో ఆయన ముఖానికి దెబ్బలు కూడా తగిలియి. దీంతో.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఏదో చేయడానికి వెళితే... ఏదో జరిగింది అనే మాట ఎప్పుడైనా విన్నారా..? పాపం ఓ ఎమ్మెల్యే విషయంలో అదే జరిగింది. ఎమ్మెల్యే హోదాలో ఓ కార్యక్రమానికి వెళ్లి బొక్కబోర్లా పడ్డాడు. బొక్క బోర్లా పడటం అంటే ఆయన పొరపాటు పడటం కాదు.. నిజంగానే కింద పడి ముఖం పగలగొట్టుకున్నాడు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉణ్నాయి.

బిహార్ రాష్ట్రం లోని సోనేపూర్ లో ఇటీవల ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ మ్యాచ్ ని ప్రారంభించడానికి బీజేపీ ఎమ్మెల్యే వినయ్ కుమార్ సింగ్ అక్కడకు వచ్చారు. అయితే... ఆ సమయంలో ఆయన చేసిన ఓ పొరపాటు.. ఆయన కింద పడేలా చేసింది. ఈ క్రమంలో ఆయన ముఖానికి దెబ్బలు కూడా తగిలియి. దీంతో.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 

వినయ్ కుమార్  సింగ్ బీహార్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, సోనేపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.  దీంతో... ఆయనను ఈ మ్యాచ్ ను ప్రారంభించడానికి ఆహ్వానించారు.

వారి ఆహ్వానం మేరకు  ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే మంగళవారం మల్కాచక్‌కు వచ్చారు. గేమ్‌లు ప్రారంభమైనట్లు ప్రకటించడానికి, వినయ్ కుమార్ సింగ్ పటాకులు కాల్చాల్సి వచ్చింది. పటాకులు కాల్చిన తర్వాత... వాటి నుంచి వచ్చే శబ్దానికి భయపడిపోయాడో లేదంటే.. అవి తన మీదే పడతాయని అనుకున్నాడో తెలీదు కానీ.... అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ క్రమంలో కిందపడిపోయాడు. ఆయన కింద పడిన తర్వాత ఆ బాంబు పేలడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ