ఇక నుంచి రాత్రి పూట కూడా పోస్టుమార్టమ్‌లు.. అవయవ స్వీకర్తలకు మేలు

Published : Nov 15, 2021, 07:43 PM ISTUpdated : Nov 15, 2021, 07:49 PM IST
ఇక నుంచి రాత్రి పూట కూడా పోస్టుమార్టమ్‌లు.. అవయవ స్వీకర్తలకు మేలు

సారాంశం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైన సదుపాయాలు, వసతులు ఉన్న హాస్పిటళ్లలో రాత్రిపూట కూడా పోస్టుమార్టంలు నిర్వహించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, హత్య, ఆత్మహత్య, లైంగికదాడి, కుళ్లిన లేదా అనుమానాస్పద స్థితిలో ఉండే మృతదేహాలకు మాత్రం రాత్రిపూట పోస్టుమార్టం చేయవద్దని సూచించింది. అవయవ దానానికి సంబంధించినదైతే ప్రాధాన్యతగా స్వీకరించి ముందుగా పోస్టు మార్టం చేయాలని తెలిపింది.  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని వసతులు అందుబాటులో ఉన్న Hospitalలో సర్యాస్తమయం తర్వాత కూడా Post Mortem నిర్వహించడానికి Union Health Ministry గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నుంచే ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వివరించింది. అయితే, ఆయా హాస్పిటల్‌లో సరిపడా సదుపాయాలు ఉన్నాయా? లేవా? అనేది హాస్పిటల్ ఇన్‌చార్జీ సమీక్షించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ప్రక్రియ కారణంగా జాప్యాన్ని నివారించవచ్చునని వివరించింది. తద్వార అవయవాలను స్వీకరించాలనుకుంటున్న వారికి మేలు జరుగుతుందని, మృతదేహం నుంచి నిర్దేశిత గడువులో అవయవాలు పాడవక ముందే సేకరించి భద్రపరచవచ్చునని తెలిపింది. అయితే, హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలు లేదా అనుమానాస్పదంగా ఉన్న మృతదేహాల పోస్టుమార్టం రాత్రిపూట నిర్వహించవద్దని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయాన్ని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బ్రిటీష్ కాలం నాటి మరో నిబంధనకు చెల్లుచీటి ఇచ్చినట్టు వివరించారు. ఇకపై పోస్టుమార్టం రోజులో 24 గంటలూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలోచనల్లోని సుపరిపాలనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. Sun Set తర్వాత కూడా పోస్టుమార్టం నిర్వహించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్న హాస్పిటళ్లలో సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టం చేయడానికి అనుమతినిచ్చినట్టు తెలిపారు.

Also Read: ఏపీకి రూ. 488.15 కోట్ల హెల్త్‌ గ్రాంట్‌ విడుదల చేసిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం షాక్..

పలువర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది మరణించిన వ్యక్తి ఆప్తులకే కాదు.. అవయవ దానం చేయగోరేవారికి, స్వీకరించే వారికి ఎంతో మేలు చేకూర్చనుందని తెలిపింది. సకాలంలో మృతదేహం నుంచి అవయవాన్ని సేకరించి భద్రపరచవచ్చునని, తద్వార అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి వీలవుతుందని వివరించింది.

ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో ఇప్పటికే రాత్రిపూట పోస్టుమార్టమ్‌లు నిర్వహిస్తున్నారని కేంద్రం తెలిపింది. అధునాతన సాంకేతికత, సరికొత్త ఆవిష్కరణల నేపథ్యంలో రాత్రిపూట పోస్టుమార్టమ్‌ నిర్వహించడానికి కావాల్సిన వెలుతురు, ఇతర సదుపాయాలు సమకూర్చుకోవచ్చునని, అది సాధ్యపడుతుంది కాబట్టే రాత్రిపూట కూడా వీటికి అనుమతులు ఇచ్చినట్టు వివరించింది. ముఖ్యంగా అవయవ దానాలకు సంబంధించిన పోస్టుమార్టమ్‌లను ప్రాధాన్యతగా తీసుకుని ముందుగా చేపట్టాలనే నిబంధననూ జోడించింది. 

Also Read: కేంద్రం కీలక నిర్ణయం: వైద్య విద్యలో ఓబీసీలకు 27, ఈడబ్ల్యుఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు

అయితే, రాత్రిపూట పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు ఆ చర్య మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయాలని కేంద్రం తెలిపింది. తద్వారా ఆ పోస్టుమార్టానికి సంబంధించి భవిష్యత్‌లో లీగల్ సమస్యలకు ఉపయోగపడుతుందని వివరించింది. హత్య, ఆత్మహత్య, రేప్, కుళ్లిన లేదా అనుమానాస్పదంగా కనిపించే మృతదేహాలకు రాత్రిపూట పోస్టుమార్టం నిర్వహించవద్దని, కేవలం లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లోనే దీనిపై సమీక్షించాల్సి ఉంటుందని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu