ఇప్పుడు కాదు.. పుల్వామా దాడి జరిగిన రోజే నేను ప్రశించాను.. అమిత్ షా వ్యాఖ్యలు అబద్దం - సత్యపాల్ మాలిక్

By Asianet NewsFirst Published Apr 25, 2023, 11:30 AM IST
Highlights

పుల్వామా దాడి జరిగిన రోజే నేను ఆ అంశంపై మాట్లాడానని జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. పదవిలో నుంచి దిగిపోయిన తరువాత మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలిపారు. 

తాను పదవీ విరమణ చేసిన తర్వాతే 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నానని అనడం సరైంది కాదని జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. తాను ఆ దాడి జరిగిన రోజే ఆ విషయంలో మాట్లాడానని చెప్పారు. అమిత్ షా వ్యాఖ్యలు అబద్దమని తెలిపారు.

ఉత్తరప్రదేశ్ సీఎంకు మరో సారి హత్యా బెదిరింపు.. ‘యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తా’ అంటూ మెసేజ్..

Latest Videos

‘‘మాతో విడిపోయిన తరువాత సత్యపాల్ మాలిక్ ఆరోపణలు చేస్తున్నారు’’ అని ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. ఈ మేరకు మాలిక్ రాజస్థాన్‌లోని సికార్‌లో మీడియాతో సోమవారం మాట్లాడారు. ‘నేను అధికారం కోల్పోయిన తరువాత ఈ అంశాన్ని లేవనెత్తానని చెప్పడం సరికాదు. దాడి జరిగిన రోజు కూడా ఈ అంశాన్ని లేవనెత్తాను’’ అని అన్నారు.

ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రధానమంత్రి పదవికి ‘సీరియస్ కాండియేట్’ అంటూ మాలిక్ అభివర్ణించారు. ఆయన ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. అయితే వచ్చే ఏడాది లోక్ సభకు జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి ఉన్న విజయావకాశాలపై మాలిక్ ను మీడియా ప్రశ్నించగా... బీజేపీ మంచి పనితీరు కనబరచాలని కోరుకుంటున్నాని అన్నారు. రాజకీయాలు, ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి కష్టంగా ఉందని, ఇంకా కొన్ని విషయాలను పరిష్కరించాల్సి ఉందని తెలిపారు.

మద్యం మత్తులో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య..

గౌతమ్ అదానీ సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ ఇంత వరకు మాట్లాడలేదని, అది ఆయనకు హాని చేస్తుందని అన్నారు. పుల్వామా ఘటనపై కూడా ప్రధాని మాట్లాడాలని సూచించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాలిక్ కోరారు. ఇక రాజస్థాన్ లో బీజేపీ సీఎం అభ్యర్థిగా వసుంధర రాజేను ప్రొజెక్ట్ చేస్తే, పార్టీ విజయ అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. 

కాగా.. ఫిబ్రవరి 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్నారు. ఈ దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని ఆయన ఇటీవల ఆరోపించారు. భద్రతా సిబ్బందిని తరలించడానికి విమానాలు ఇవ్వాలని తాను కేంద్రాన్ని కోరానని, కానీ దానికి ప్రభుత్వం నిరాకరించిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. 

సానియా మీర్జాతో గడిపేందుకు సమయం దొరకట్లేదు - పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్

దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంలో బీజేపీ కప్పిపుచ్చుకోవాల్సిందేమీ లేదని అన్నారు. తమతో విడిపోయిన తరువాత మాలిక్ ఆరోపణలు చేస్తున్నారని, దీనిని ప్రజలు, మీడియా అర్థం చేసుకోవాలని కోరారు. అయితే మాలిక్ కు సీబీఐ సమన్లు జారీ చేయడంపై అమిత్ షా మాట్లాడారు. ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం వల్లే ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసిందని చెప్పడంలో వాస్తవం లేదని అన్నారు. గతంలో కూడా ఆయనను ఏజెన్సీ దర్యాప్తు చేసిందని తెలిపారు. 

click me!