ఉత్తరప్రదేశ్ సీఎంకు మరో సారి హత్యా బెదిరింపు.. ‘యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తా’ అంటూ మెసేజ్..

Published : Apr 25, 2023, 10:19 AM IST
ఉత్తరప్రదేశ్ సీఎంకు మరో సారి హత్యా బెదిరింపు.. ‘యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తా’ అంటూ మెసేజ్..

సారాంశం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ ను చంపేస్తానంటూ ఆ రాష్ట్ర అత్యవసర సేవల విభాగానికి ఓ గుర్తు తెలియని దుండగుడు మేసేజ్ చేశాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని ఓ మీడియా సంస్థకు ఈమెయిల్ వచ్చిన కొద్ది రోజులకే ఆయనకు మరో హత్యా బెదిరింపు వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి ‘డయల్ 112’ (అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నంబర్) కు ముఖ్యమంత్రిని హత్య చేస్తానంటూ మెసేజ్ వచ్చింది. ఆదివారం ఉదయం 10 గంటలకు వచ్చిన మెసేజ్ లో ‘త్వరలోనే సీఎం యోగిని చంపేస్తాను’ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.

మరో యవతితో వివాహం.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు.. పురుషుడి వేశంలో వచ్చి మరీ దాడి..

కాగా.. ఈ బెదిరింపులకు పాల్పడిన గుర్తు తెలియన వ్యక్తిపై లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 506, 507, ఐటీ యాక్ట్ 66 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పంపిన వ్యక్తిని రెహాన్ గా పోలీసులు గుర్తించారు. ఈ నెల ప్రారంభంలో కూడా యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు మెయిల్ పంపించిన 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు యూపీ సీఎంను చంపేస్తామని ఓ మీడియా సంస్థకు మెయిల్ పంపించాడు.

ఆ బాలుడు బీహార్ కు చెందిన వ్యక్తి అని, అతడిని లక్నోలోని చిన్హాట్ ప్రాంతంలో అరెస్టు చేసి నోయిడాకు తీసుకువచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నోయిడా) రజనీష్ వర్మ తెలిపారని ‘టైమ్స్ నౌ’ తెలిపింది. బాలుడిని నోయిడాలోని జువైనల్ కోర్టులో హాజరుపర్చగా, ఆ తర్వాత బెయిల్ మంజూరైనట్లు పీటీఐ నివేదించింది.

కాగా.. ఏప్రిల్ 24న కొచ్చిలో పర్యటించే ప్రధాని నరేంద్ర మోడీపై ఆత్మాహుతి బాంబు దాడి చేస్తామని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడిని జేవియర్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నుతున్నట్లు తనకు గత వారం లేఖ అందిందని కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ పేర్కొన్నారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

అకాల వర్షాలు.. తెలంగాణ సరిహద్దుల్లో పిడుగు పడి నలుగురి మృతి

ప్రధానమంత్రికి బెదిరింపు లేఖ పంపిన వ్యక్తిని టెక్నాలజీని ఉపయోగించి పట్టుకున్నామని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ కె. సేతు రామన్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. వ్యక్తిగత శత్రుత్వమే ఆ లేఖ రాయడానికి కారణమని పోలీసులు గుర్తించారు. అయితే ప్రధాని పర్యటనకు గట్టి భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీని కోసం 2,060 మంది పోలీసులను మోహరించామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌