బీజేపీలో చేరడం లేదు, నేను ఇంకా కాంగ్రెస్ సభ్యుడినే: సచిన్ పైలెట్

By narsimha lodeFirst Published Jul 15, 2020, 10:36 AM IST
Highlights

తాను బీజేపీలో చేరడం లేదని, ఇంకా తాను కాంగ్రెస్ మనిషేనని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ప్రకటించారు. 


న్యూఢిల్లీ:తాను బీజేపీలో చేరడం లేదని, ఇంకా తాను కాంగ్రెస్ మనిషేనని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ప్రకటించారు. 

రాజస్థాన్ ప్రభుత్వాన్ని పతనం అంచు వరకు తీసుకెళ్లిన సచిన్ పైలెట్ పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకొంది. మంగళవారం నాడు డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పోస్టుల నుండి ఆయనను తొలగించింది.

తాను బీజేపీలో చేరాలనుకోవడం లేదని, ఆ ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు తాను ఎంతో కృషి చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. 

తాను ఇప్పటికీ కూడ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినేనని ఆయన స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలెట్ ఈ నెల 12వ తేదీన తిరుగుబాటు చేశాడు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో ఆయన న్యూఢిల్లీకి చేరుకొన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనను అవమానించేందుకు చేసిన ప్రయత్నాలను భరించినట్టుగా ఆయన చెప్పారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి జ్యోతిరాదిత్యసింధియా బయట పడిన తర్వాత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ ఘటన జరిగి మూడు నెలలు అవుతోంది. 

రాజస్థాన్ రాష్ట్రంలో సచిన్ పైలెట్ అసమ్మతి స్వరం విన్పించడంతో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, ఇతర కీలక నేతలు కూడ ఆయనతో చర్చించారు.తాను రాజస్థాన్ ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్టుగా ఆయన ఓ జాతీయ న్యూస్ ఛానెల్ కు చెప్పారు.

also read:గవర్నర్‌తో ఆశోక్ గెహ్లాట్ భేటీ: ఎప్పటికైనా సత్యమే విజయం సాధిస్తోందన్న సచిన్

2018లో రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి నుండి చివరి నిమిషంలో ఆయన తప్పుకొన్నారు.ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీని తాను పునర్మించినట్టుగా సచిన్ పైలెట్ చెప్పారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన కృషి ఎంతో ఉందన్నారు.

సచిన్ పైలెట్ సహా ఆయనకు మద్దతుదారులుగా ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ చర్యలను ప్రారంభించింది.అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మెజారిటీకి అవసరమైన సభ్యుల సంఖ్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది.

click me!