పోలీసులను చంపాలని వికాస్ చెప్పాడు: దూబే అనుచరుడు శశికాంత్

By narsimha lodeFirst Published Jul 15, 2020, 10:14 AM IST
Highlights


న్యూఢిల్లీ: పోలీసులను చంపాలని వికాస్ దూబే తమను ఆదేశించాడని.. లేకపోతే తమను చంపుతానని ఆయన హెచ్చరించినట్టుగా  దూబే అత్యంత సన్నిహితుడు శశికాంత్ పాండే చెప్పారు.
 


న్యూఢిల్లీ: పోలీసులను చంపాలని వికాస్ దూబే తమను ఆదేశించాడని.. లేకపోతే తమను చంపుతానని ఆయన హెచ్చరించినట్టుగా  దూబే అత్యంత సన్నిహితుడు శశికాంత్ పాండే చెప్పారు.

ఈ నెల 3వ తేదీన కాన్పూరుకు సమీపంలోని బిక్రూ గ్రామంలో పొలీసులపై వికాస్ దూబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే.

పోలీస్ స్టేషన్ నుండి తనకు సమాచారం వచ్చిందని... తనను చంపేందుకు పోలీసులు వస్తున్నారని దూబే తమకు చెప్పినట్టుగా పాండే పోలీసులకు వివరించారు. పోలీసులను చంపకపోతే వారు మనల్ని చంపుతారని దూబే తమకు చెప్పాడని పాండే తెలిపారు. దేవేంద్ర మిశ్రాతో పాటు మరో ఇద్దరు పోలీసులనను దూబే అతని అనుచరులు పాండే ఇంట్లోనే హతమార్చారు. 

వికాస్ దూబే మామ కొడుకే శశికాంత్ పాండే. దూబే ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత శశికాంత్ పాండేను పోలీసులు ఈ నెల 14వ తేదీన అరెస్ట్ చేశారు.  పాండే వద్ద రైఫిల్స్ స్వాధీనం చేసుకొన్నారు.

వికాస్ దూబే, ప్రభాత్ మిశ్రా, అతుల్ దూబేలతో కలిసి తాను పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. జూలై 3వ తేదీన పోలీసులు తమపై దాడికి వస్తున్నారని తమకు దూబే చెప్పాడన్నారు. వారిపై దాడి చేసేందుకు ఆయుధాలు ఉన్నట్టుగా  ఆయన వివరించారన్నారు.

శశికాంత్ పాండేను కాన్పూరులోని మేలా తిరహా ఏరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రూ. 50 వేల రివార్డు ఉంది.

తన ఇంట్లోని ఇన్సాస్ రైఫిల్ 20 కార్టిడ్జెస్ ను స్వాధీనం చేసుకొన్నట్టుగా కాన్పూర్ అడిషనల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. పాండే ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఇంటిపై దాడి చేసి ఈ ఆయుధాన్ని స్వాధీనం చేసుకొన్నామన్నారు.

పోలీసుల నుండి స్వాధీనం చేసుకొన్న ఆయుధాలను దాచిపెట్టినట్టుగా  పాండే తెలిపారు. దూబే నివాసం నుండి ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నట్టుగా ప్రశాంత్ కుమార్ చెప్పారు.

ఈ నెల 10వ  తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో వికాస్ దూబే మరణించారు. రోడ్డు ప్రమాదంలో పోలీసు వాహనం నుండి తప్పించుకొనే ప్రయత్నం చేయడంతో పోలీసుల కాల్పుల్లో దూబే ఎన్ కౌంటర్ లో మరణించాడు.

click me!