బీజేపీ తన కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పార్టీ నాయకుల కుటుంబాలకు తమ పార్టీ టిక్కెట్లు ఇవ్వదని, అవి కార్యకర్తల కోసమే అని తెలిపారు.
ఎన్నికలలో నాయకుల కుటుంబాలకు తమ పార్టీ ప్రధాన్యత ఇవ్వదని, కేవలం పార్టీ పని చేసే కార్యకర్తలకే ఇస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వచ్చే నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్ లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరును కొనియాడారు.
అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘‘ పార్టీని బలోపేతం చేయడానికి మంత్రులు, శాసనసభ్యుల కుటుంబాలను మేము ప్రోత్సహిస్తాము. అయితే ఎన్నికలలో మాత్రం కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తాం ’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘ ఉత్తరప్రదేశ్‌లో చాలా మంది శాసనసభ్యుల పిల్లలు సమర్థులుగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చు. కానీ మనం ఒక విధానాన్ని అనుసరించాలి. అది ఇచ్చే బాధ స్పష్టంగా ఉంది. అంతిమంగా మనం మన పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలి. ’’ అని అన్నారు.
Sourav Ganguly : రాజకీయాల్లోకి రావడం లేదు.. ఎడ్యుకేషనల్ యాప్ తీసుకొస్తున్నా - సౌరవ్ గంగూలీ
‘‘ దేశ చిరకాల రాజకీయ సంస్కృతికి, ఆచరణకు విరుద్ధమైన అంశంపై మనం పనిచేస్తున్నాం. వంశపారంపర్య రాజకీయాలకు మనం వ్యతిరేకం. అలా చేయకపోతే ఏ కార్యకర్త పార్టీ కోసం పని చేయాలనుకుంటారు. కొన్ని కుటుంబాలు మాత్రమే నిర్వహించాలా ’’ అని జేపీ నడ్డా అన్నారు. ‘‘ ఇది పాలసీని అనుసరించాల్సిన విషయం. దీనికి చాలా సార్లు శస్త్రచికిత్సలు చేయవలసి ఉంటుంది. గాయాన్ని పరిష్కరించడానికి డెట్టాల్ ను కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల మధ్య ప్రదేశ్ ఉప ఎన్నికలలో మేము కొన్ని స్థానాలను కోల్పొవలసి వచ్చింది. కానీ ఇప్పటికీ మేము కార్యకర్తలకు మాత్రమే టిక్కెట్టు ఇస్తామనే విషయానికి కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు.
“ ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన రెండు మూడు ఉప ఎన్నికల్లో, ఫలితాల విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ అధినేత మమ్మల్ని హెచ్చరించినప్పటికీ, మేము కార్యకర్తలను రంగంలోకి దించే విధానానికి కట్టుబడి ఉన్నాము తప్ప మా రాజకీయ నాయకుల పిల్లలు లేదా కుటుంబ సభ్యులకు కాదు. ఈ విధానాన్ని భవిష్యత్తులో కూడా అమలు చేస్తాం’’ అని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
బిన్ లాడెన్ ఫొటోను ఆఫీసులో పెట్టిన గవర్నమెంట్ అధికారి.. వరల్డ్ బెస్ట్ ఇంజనీర్ అంటూ రాసి మరీ..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసుపై నోటీసు, బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చేసిన దాడిపై నడ్డా స్పందిస్తూ, ‘‘ ఎవరైనా నిందితులు తాను కళంకితుడిని అని చెప్పడం మీరు ఎప్పుడైనా చూశారా లేదా విన్నారా? కాంగ్రెసు ఇక మీదట భారతీయమైనది కాదు. అది జాతీయమైనది కాదు. ఇకమీదట అది కాంగ్రెస్ కాదు. ఇది భాయ్-బెహెన్ యొక్క పార్టీ. రాహుల్ గాంధీ భారత గడ్డపై ఏమీ మాట్లాడటం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆయన మాట వినడానికి ఎవరూ ఇష్టపడరు.
‘‘ ఆయన (రాహుల్ గాంధీ) విదేశాలకు వెళ్లాలనుకునే చోటికి వెళ్లినివ్వండి. లండన్, బర్మింగ్హామ్, నేపాల్లలో ఏం కావాలన్నా చేయనివ్వండి. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయంగా ఆయన కోరుకున్న చోటికి వెళ్లే స్వేచ్ఛ అతడికి ఉంది ’’ అని నడ్డా తెలిపారు. కాగా మధ్యప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. జూలై 6న 11 జిల్లాల్లో మొదటి విడత, జూలై 13న 38 జిల్లాల్లో రెండో విడత ఎన్నికలు చేపట్టనున్నారు. మొదటి విడతలో జరిగిన ఎన్నికల ఫలితాలను జూలై 17న, రెండో విడతలో జరిగిన ఎన్నికల ఫలితాలను
జూలై 18న లెక్కించనున్నారు.