వైమానిక దళం ఉపయోగించకపోవడంతో నష్టం:1962 లో చైనా, భారత్ యుద్ధంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

By narsimha lode  |  First Published Nov 19, 2023, 10:07 AM IST

1962 లో భారత్, చైనా మధ్య జరిగిన యుద్ధం  గురించి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్  కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూస్ 9 ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో   కేంద్ర మంత్రి పలు విషయాలను ప్రస్తావించారు.


న్యూఢిల్లీ: 1962లో  జరిగిన భారత్, చైనా యుద్ధంలో  వైమానిక దళాన్ని మోహరించకపోవడం వల్ల  భారత్ నష్టపోయిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.న్యూస్ 9 ప్లస్  ఎడిటర్,  సందీప్ ఉన్నితాన్  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ను ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో  పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.

ఇండియా, చైనా యుద్ధం గురించి ఆయన పలు అంశాలను ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.  1947 స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి సాయుధ దళాల ఆధునీకీకరణ లేకపోవడం, రాజకీయ నాయకత్వంలోని అహంకారం, అసమర్థత, బలమైన భద్రతా ఫ్రేమ్ వర్క్ కు నిబద్దత లేదని ఆయన  అభిప్రాయపడ్డారు. ధృడమైన  శత్రువుతో  తాము అలవాటు లేని, శిక్షణ లేని సైనికులు, కమాండర్లను యుద్ధానికి పంపినట్టుగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఈ యుద్ధం జరిగిన సమయంలో  అప్పటి రక్షణ మంత్రి వికె. కృష్ణమీనన్, అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రులు గొప్పవారు కావచ్చు. కానీ చైనాతో వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.

Latest Videos

undefined

 1962 ఇండియా చైనా యుద్ధంలో రెండు అంశాలున్నాయన్నారు.  ఒకటి మన భూభాగంలో  38,000 చ.కి.మీ. విస్తీర్ణంలో  అవమానానికి గురికావడానికి  పొరుగుదేశం  మనని  మోసపూరితంగా  తప్పుదారి పట్టించిందని  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.  ఇది మళ్లీ మళ్లీ జరగదని తాను కచ్చితంగా అనుకోనన్నారు.  మనకు స్పష్టమైన  వైమానిక ఆధిపత్యం ఉన్నప్పటికీ  ఏనాడూ కూడ వైమానిక దళాన్ని మోహరించలేదన్నారు. ఈ తరహా ఉదంతాలు  2023 లో పునరావృతం కావన్నారు. 

 అయితే చరిత్రలో  1962లో జరిగిన యుద్ధాన్ని ఎప్పటికి మరిచిపోకూడదన్నారు. ఎందుకంటే మేజర్ షైతాన్ సింగ్, సుబేదార్ జోగిందర్ సింగ్ వంటి వ్యక్తులు భావి భారత్ కు  తమ రక్తంతో  నిర్మించారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.

1962 లో జరిగిన చైనా, ఇండియా యుద్ధం గురించి  తన  తండ్రి ఎంకె చంద్రశేఖర్ కథలు కథలుగా చెప్పాడని  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత  ఈ యుద్ధంలో మృతి చెందిన  సైనికుల మృతదేహల తరలింపు,  గాయపడిన సైనికుల విషయంలో  జరిగిన పరిణామాలను తన తండ్రి ద్వారా తెలుసుకున్నట్టుగా  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.

 పాకిస్తాన్ తరహలో తిరుగుబాట్లు జరుగుతాయిన  సాయుధ దళాలకు తక్కువ నిధులను అందించడం , బలమైన నాయకులను కిందకు నెట్టే పరిస్థితి ఉండేదని రాజీవ్ చంద్రశేఖర్ అప్పటి పరిస్థితుల గురించి ఆరోపణలు చేశారు. 

 కృష్ణ మీనన్ తరహా మంత్రుల యుద్ధాలు ఎప్పటికీ గెలవలేమని మిలటరీ చరిత్ర చెబుతుందన్నారు. 1962, ఆ తర్వాత  వచ్చిన జనరల్స్  మానేక్ష లేదా తిమ్మయ్య వంటి జనరల్స్  భారతదేశ సైనిక  విశ్వాసం, సామర్థ్యాలను మార్చారని కేంద్ర మంత్రి చెప్పారు. 1962లో  జరిగిన  యుద్ధంలో  భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు.  38,000 చదరపు కిలోమీటర్ల భూమిని శాశ్వతంగా  కోల్పోవడానికి కారణమైందని కేంద్రమంత్రి చెప్పారు.   1962లో  చైనాతో జరిగిన యుద్ధంలో  భారత్ ఎందుకు వైమానిక దళాన్ని  ఉపయోగించలేదో  ఇప్పటికీ  ఒక రహస్యంగా  మిగిలిపోయిందన్నారు.  

అయితే ఇవాళ మాత్రం ప్రతి చదరపు అంగుళం భూమి కోసం గట్టిగా పోరాటం చేస్తున్నామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.  1959లో  అప్పటి ప్రధానమంత్రి  చేసిన వ్యాఖ్యలను  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రస్తావించారు. గడ్డి కూడ మొలవని  ఈ స్థలంపై మనం ఎందుకు పోరాడుతున్నామన్నారు.  అందమైన పర్వతాల కోసం  గొడవలు ఎందుకు జరగాలన్నారు.జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాధేశిక సమగ్రతపై దృష్టి పెట్టాల్సిన సమయంలో  అప్పటి ప్రధాని ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్నారు.

అప్పటి ప్రధాని నెహ్రును అప్పటి రక్షణ మంత్రి మీన్ తప్పుదారి పట్టించారా అతనే తప్పుదారి పట్టాడా అనేది తేలలేదన్నారు.  అయితే వైమానిక దళాన్ని మోహరించని కారణంగా  తీవ్రమైన నష్టం జరిగిందని  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. 

భారతదేశానికి నష్టం కల్గించాలని , ఆర్ధిక శక్తిగా  భారత్ ఎదుగుదలను తగ్గించాలని, అశాంతిని సృష్టించాలనే దేశాలకు  సరైన రీతిలో బుద్ది చెప్పే స్థితిలో ఇండియా ఉందన్నారు.  మన పొరుగున ఉన్న ప్రతి దేశం పట్ల మన విధానం చాలా స్పష్టంగా ఉందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.  శాంతియుతంగా  సహజీవనం చేయాలనుకుంటున్నామన్నారు.  భారత్ ను అభివృద్ధి చేయడమే  తమ ప్రాధాన్యతగా ఆయన  చెప్పారు. కానీ, పాకిస్తాన్ వంటి దేశాలు భారత్ లో  అశాంతిని రెచ్చగొట్టడమే లక్ష్యంగా  పనిచేస్తున్నాయన్నారు. 

1962లో  చైనీయులు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని అప్పటి  ప్రధాని నెహ్రు భావించారు. అంతేకాదు  చైనా ఇండియాపై  దాడి చేయరని నమ్మి ఉండొచ్చన్నారు. 26/11 తో సహా  పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద బాధితులకు  న్యాయం జరగాలని తాను భావిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.
1962లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత సరిహద్దులపై  దాడి చేసింది.ఈ దాడిలో సరిహద్దులో రక్షణగా ఉన్న 1300 మంది భారత సైనికులు మరణించారు.  61 ఏళ్ల తర్వాత  ఇండియా,చైనా యుద్ధం గురించి భారతదేశ ఓటమి గురించి  ప్రశ్నలు తమను వెంటాడుతూనే ఉన్నాయి.  ఇకపై ఈ తరహా చరిత్ర పునరావృతం కాదని కూడ కచ్చితంగా చెప్పవచ్చు.

click me!