Rahul Gandhi: "నాపై వాటి ఒత్తిడి ప‌ని చేయ‌ద‌ని ప్ర‌ధానికి అర్థ‌మైంది": రాహుల్ గాంధీ

Published : Feb 10, 2022, 04:41 PM ISTUpdated : Feb 10, 2022, 04:44 PM IST
Rahul Gandhi: "నాపై వాటి ఒత్తిడి ప‌ని చేయ‌ద‌ని ప్ర‌ధానికి అర్థ‌మైంది":  రాహుల్ గాంధీ

సారాంశం

Rahul Gandhi: త‌న‌పై ఈడీ, సీబీఐ లాంటి ద‌ర్యాప్తు సంస్థ‌లను ఉసిగొల్ప‌డం ప‌నికిరాద‌న్న‌దని ప్ర‌ధాని అర్థమ‌య్యింద‌నీ, ఎంత‌కూ విన‌ని తెలిసింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అస‌లు నేనెందుకు వారి మాట‌లు వినాలి? అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.  

Rahul Gandhi: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌కు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం కౌంట‌ర్ ఇచ్చారు. తనపై సీబీఐ, ఈడీల ఒత్తిడి పని చేయబోవని ప్రధాని మోడీకి అర్థమైపోయిందని, ఆయన అహంకారాన్ని చూసి నవ్వుకుంటున్నానని తెలిపారు. మోడీ బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రస్తావించారు.

ప్ర‌ధాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'రాహుల్ వినడు.. అతనిపై ఎంత ఒత్తిడి తెచ్చినా అతను వెనక్కి తగ్గడు " అని అన్నారు. దాని అర్థం మీకు తెలుసా..?  అంటే.. త‌న‌పై ED, CBI ఒత్తిడి పనిచేయదని ప్ర‌ధాని మోడీకి అర్థమ‌య్యింద‌ని అని రాహుల్ గాంధీ అన్నారు. 

తాను ప్ర‌ధాని ఎందుకు వింటాను? అని ప్ర‌శ్నించారు. నోట్ల రద్దు అయినప్పటికీ, లోపభూయిష్ట GST (వస్తువులు మరియు సేవల పన్ను) ద్వారా భారతదేశంలోని చిన్న వ్యాపారులు, మధ్య తరహా వ్యాపారాలు, రైతులు, కార్మికులను జీవితాల‌ను నాశనం చేసారని" అని రాహుల్ గాంధీ అన్నారు. తాను నరేంద్ర మోదీకి భయపడనని,మోడీ అహంకారం చూస్తే.. త‌న‌కి నవ్విస్తుందని అన్నారు.
 
గత వారం పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్-చైనా సరిహద్దు వివాదం, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలపై స్పష్టత లేద‌ని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. త‌మ‌ హ‌యాంలో 4 ల‌క్ష‌ల మందికి ఉపాధి ఇచ్చామ‌ని, న్యాయ్ ప‌థ‌కం కింద పేద‌ల‌కు స‌హాయం కూడా చేశామ‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తనపై సీబీఐ, ఈడీలు పని చేయబోవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అర్థమైపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు.  

కోవిడ్ మహమ్మారి సమయంలో స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేయడం తప్పు అంటున్నారన్నారు. తాము అధికారంలో లేమని, నరేంద్ర మోదీ తన పని తాను చేయరని అన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రజలను నిరుద్యోగులుగా మార్చారన్నారు.

ప్ర‌ధాని మోడీ ఏమ‌న్నారంటే..

ప్ర‌ధాని  మోడీ బుధ‌వారం ఓ జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు.  స‌భ‌కు హాజ‌ర‌నికాని వారికి స‌మాధానం ఇవ్వ‌లేన‌ని తేల్చి చెప్పారు. రాహుల్ ప్ర‌స్తావించిన అంశాల గురించి ప్రధానికి అడ‌గ్గా… స‌త్యాల ఆధారంగా తాను ప్ర‌తిదానిపై వివ‌ర‌ణ ఇచ్చాన‌ని స్ప‌ష్టం చేశారు. విదేశాంగ శాఖ‌, ర‌క్ష‌ణ శాఖ‌లు కొన్ని విష‌యాల‌పై చాలా వివ‌ర‌ణాత్మ‌క‌మైన జ‌వాబులు ఇస్తాయ‌ని, అప్పుడ‌ప్పుడు తాను కూడా స‌మాధాన‌మిస్తాన‌ని మోడీ పేర్కొన్నారు. పార్ల‌మెంట్‌కు హాజ‌రుకాని వారికి, విన‌ని వారికి నేనెలా స‌మాధానం చెప్ప‌గ‌ల‌ను? అంటూ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu