బామ్మ, పిల్లల దేశభక్తిని గౌరవించిన ఇండియన్ నేవీ.. వారికి ఇళ్లు నిర్మించేందుకు ముందుకొచ్చిన మేజర్ రవి..

Published : Feb 10, 2022, 04:21 PM ISTUpdated : Feb 10, 2022, 04:54 PM IST
బామ్మ, పిల్లల దేశభక్తిని గౌరవించిన ఇండియన్ నేవీ.. వారికి ఇళ్లు నిర్మించేందుకు ముందుకొచ్చిన మేజర్ రవి..

సారాంశం

కొందరు పిల్లలతో కలిసి ఓ బామ్మ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన తీరు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ మారింది. దీంతో వారి దేశభక్తికి ముగ్దులైన నేవి అధికారులు వారికి మోటివేషనల్ టూర్‌లో భాగంగా Kochi naval base సందర్శించేలా చేశారు.  

కొందరు పిల్లలతో కలిసి ఓ బామ్మ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ మారింది. దీంతో వారి దేశభక్తికి ముగ్దులైన కొచ్చిలోని దక్షిణ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలోని అధికారులు వారికి మోటివేషనల్ టూర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా.. ఏడుగురు పిల్లలతో పాటుగా 15 మంది బృందానికి కొచ్చి నౌకాదళ స్థావరాన్ని సందర్శించేందుకు అవకాశం కల్పించారు. Kochi naval baseకు వెళ్లిన వారు.. అక్కడి సిబ్బందితో పాటుగా ఇతరులతో సంభాషించారు. అయితే ఈ పిల్లలతో కూడిన బృందం కొచ్చి నౌకాదళ స్థావరాన్ని సందర్శించడంలో ఫిల్మ్ డైరెక్టర్, ఆర్మీ మేజర్ రవి(రిటైర్డ్) కీలక పాత్రను పోషించారు. 

"

వివరాలు.. కేరళలోని త్రిసూరు జిల్లాలోని చేపూర్‌లోని తన ఇంటి ముందు ఒక అమ్మమ్మ, పిల్లలతో కలిసి రిపబ్లిక్ డే రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారంది. ఆ పెద్దావిడ పెద్దగా చుదువుకోకపోయినప్పటికీ.. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేయడం నిజంగా ప్రేరణగా నిలించింది. ఈ క్రమంలోనే వారిన దక్షిణ నావల్ కమాండ్ నుంచి ఈ విధమైన ఆహ్వానం అందింది. వారు కొచ్చి నౌకాదళ స్థావరాన్ని సందర్శించడం, ఆ పర్యటనను సమన్వయం చేయడంలో మేజర్ రవి ముఖ్య భూమిక వహించారు.

Kochi naval baseకు వెళ్లిన వారు.. అక్కడ దాదాపు 4 నుంచి 5 గంటల సమయం గడిపారు. amphibious operationsలో ఉపయోగించే ల్యాండింగ్ షిప్ అయిన INS మగర్‌‌లోకి వెళ్లి చూశారు. వారి ముందు వివిధ రకాల ప్లాట్‌ఫారమ్‌లు, ఆయుధ వ్యవస్థలను నేవీ ప్రదర్శించింది. అంతేకాకుండా వారు నౌకాదళ మ్యూజియం పర్యటించారు. ‘నిరుపేద కుటుంబం వారి ఇంటి ముందు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఇందుకు స్ఫూర్తినిచ్చింది. పాఠశాల  విద్యార్థులను తమ ఇళ్లలో పెద్దలతో కలిసి రిపబ్లిక్ డే జరుపుకోవాలని ఉపాధ్యాయులు కోరారు. దీంతో వారు రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకున్నారు.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది’ అని కొచ్చికి చెందిన డిఫెన్స్ పీఆర్‌వో తెలిపారు. 

కొచ్చి నౌకాదళ స్థావరాన్ని పిల్లలతో కూడిన బృందం సందర్శనను సమన్వయం చేయడంతో పాటుగా, వారి ఇళ్లను పునరుద్ధరించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కీలకపాత్ర మేజర్ రవిని(రిటైర్డ్).. ఏషియానెట్ సంప్రదించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ఏషియానెట్ తో పంచుకున్నారు. 

"

ప్రశ్న: 70 ఏళ్ల వృద్ధురాలు మరియు ఆమె పిల్లలు ఆమె ఇంటి ముందు జెండాను ఎగురవేయడం గురించి మీకు ఎలా తెలిసింది?
Major Ravi (R):
చాలా మంది ఫార్వర్డ్‌ మెసేజ్‌లు నా దగ్గరకు వస్తూనే ఉంటాయి. జనవరి 26న ఈ మహిళ పిల్లలతో శ్రద్ధగా, పూర్తి క్రమశిక్షణతో జెండాను ఎగురవేస్తున్న వీడియో నాకు వచ్చింది. వీడియో మొత్తం నేను చూశాను. అందులో చాలా ఉత్సాహంగా ఉన్న రెండేళ్ల పిల్లవాడిని నేను చూశాను. అదేమిటో తెలియకున్న.. ఆమె దేశభక్తిని ప్రదర్శించింది. మనం ఇలాంటి వారిని, జనరేషన్‌ను ప్రోత్సహించాల్సి ఉందని నేను అనుకున్నాను.

ఆ వీడియోలో అమ్మమ్మ పిల్లలందరికీ నీతి, దేశభక్తిని తనదైన రీతిలో బోధించడం కూడా చూశాను. ఆమె అంత బాగా చదువుకున్నది కాదు.. ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే చాలా మంది విద్యావంతులు మీకు కనిపిస్తారు. దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. మనవళ్లకు సరైన విషయాలు నేర్పుతున్న ముసలి బామ్మ అకస్మాత్తుగా మాకు కనిపించింది. నేను ఆమె చిరునామాను తెలుసుకోవడానికి ప్రయత్నించాను.

ప్రశ్న: మీరు వారిని ఎలా చేరుకున్నారు?
వీడియోలో.. పాఠశాల పేరు CNN GHS అని హైలైట్ చేయబడింది. ఈ వీడియో గురించిన వివరాలను తెలుసుకోవడానికి నేను నా సహాయకుడిని అడిగాను. మరుసటి రోజు ఉదయం.. నాకు బామ్మ కోడలు కాంటాక్ట్ నంబర్ వచ్చింది.

ప్రశ్న: మీరు వారిని సంప్రదించినప్పుడు వారి స్పందన ఏమిటి?
నేను బామ్మ కోడలితో మాట్లాడినప్పుడు.. నేను (మేజర్ రవి) కాల్ చేశానని చెప్పాను. కానీ ఆమె నమ్మలేదు. మేజర్ రవి నాకేందుకు కాల్ చేస్తాడని అడిగింది. దీంతో నేను విషయం ఆమెకు అర్థమయ్యేలా వివరించాల్సి వచ్చింది. నీలిరంగు ప్లాస్టిక్ కవర్‌తో కప్పబడిన ఇంటి గురించి నేను అడిగినప్పుడు.. ఆమె తన పిల్లలతో కలిసి ఉండే ఇల్లు అదేనని చెప్పింది. నా దేశభక్తి దృష్ట్యా.. ఇంటికి పక్కా ఇంటిని నిర్మిస్తానని, మేం మొత్తం చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు నమ్మలేదు. పైకప్పు నిర్మాణానికి అయ్యే అంచనా వ్యయం కోసం నా కాంట్రాక్టర్‌ని పంపాను.

ప్రశ్న: మీరు వారికి ఎలాంటి సహాయాన్ని అందించారు?
నేను వీడియో గురించి నా స్నేహితులలో ఒకరితో చర్చించాను. నా నిర్ణయం గురించి ఆయనకు తెలియజేశాను. దీంతో నేను చెప్పిన వాటి కోసం నిధులు సేకరిస్తామని చెప్పారు. నిధుల సేకరణ కోసం మేము బ్యాంక్ ఖాతా వివరాలను పంచుకున్నాము. ఈ క్రమంలోనే అందులో ఉన్న రెండేళ్ల పాప ఇల్లు కూడా అలాంటిదేని, ఆమె తండ్రి కూడా పేదవాడని కూడా మాకు తెలిసింది. తర్వాత మేము రెండు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు రూ.16 లక్షలతో రెండు ఇళ్లకు పనులు ప్రారంభించారు. దీనిని అసలు ఊహించలేకపోయారు.

ప్రశ్న: సదరన్ నావల్ కమాండ్‌లో వారి సందర్శన గురించి ఏం చెప్తారు..
నిన్న వారందరూ యుద్ధనౌకలు, నౌకాదళ ఆస్తులను చూడటానికి వచ్చారు. ఈ ఆహ్వానానికి పిల్లలందరూ పొంగిపోయారు. ప్రజలను ప్రోత్సహించేందుకు భారత నౌకాదళం దీనిని నిర్వహించింది. అలాంటి పిల్లలను మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు.. ఈ పిల్లలు సైన్యం, సాయుధ దళాలలో చేరడానికి ప్రేరణ పొందుతారు. వారు తప్పుడు ట్రాక్‌లో పడిపోయి తప్పుడు పనులు చేయరు. లేకపోతే ఈ రోజుల్లో అలాంటి పిల్లలు ఎక్కడికి వెళతారో మనకు తెలియదు. అందుకే ఈ పిల్లల మనస్సులలో దేశభక్తి రావడానికి మేము ఈ రకమైన పని చేయాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న: ఇళ్ల నిర్మాణాన్ని ఎంత గడువులో పూర్తి చేస్తారు?
మే 15లోగా రెండు ఇళ్లను పూర్తి చేసి వారికి అందజేస్తాం. ఆగస్టు 15, జనవరి 26న త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేలా శాశ్వతంగా జెండా ఎగరవేసేందుకు అనువుగా పోడియం ఏర్పాటు చేయాలని నేను కాంట్రాక్టర్‌కు చెప్పాం. ఈ తరం వారి ఇళ్లలో ఇలాంటి ఆచారాన్ని కొనసాగించనివ్వండి. దీని ద్వారా వారి పొరుగువారు కూడా ప్రేరణ పొందుతారు. మనం జీరో నుంచి ప్రారంభిద్దాం.. అదే 100 అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu