
ప్రధాన మంత్రి అభివృద్ధి ప్యాకేజీ (Prime Ministers Development Package) కింద జమ్మూకశ్మీర్ లో ని చేస్తున్న ఒక్క కాశ్మీర్ పండిత్ కూడా ఇటీవల రాజీనామా చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వివరాలను మంగళవారం పార్లమెంట్ కు వెల్లడించింది. ఈ సమాచారాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అందించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభకు తెలిపారు.
Yashwant Sinha: "నేను ఏ రాజకీయ పార్టీలో చేరను.." ఓటమి తర్వాత యశ్వంత్ సిన్హా సంచలన ప్రకటన
లోయలో కశ్మీరీ పండిట్ల భద్రతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేసిందని రాయ్ చెప్పారు. బలమైన భద్రత, ఇంటెలిజెన్స్ గ్రిడ్, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చురుకైన చర్యలు, కశ్మీరీ పండిట్లు నివసించే ప్రాంతాల్లో పెట్రోలింగ్ మొదలైనవి ఇందులో ఉన్నాయని రాయ్ చెప్పారు. ఈ మేరకు శివసేన ఎంపీలు అరవింద్ సావంత్, వినాయక్ రౌత్‌ల ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
గత కొన్ని నెలలుగా కాశ్మీర్ లోయలో కాశ్మీరీ పండిట్లు, వలస కార్మికుల హత్యల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రధాని ప్యాకేజీ కింద పనిచేస్తున్న పలువురు కశ్మీరీ పండిట్లు తమకు రక్షణ కల్పించాలని, చర్యలు తీసుకోవాలని కోరుతూ చాలా రోజుల పాటు నిరసనలు చేపట్టారు. లక్షిత హత్యలు, దాడుల దృష్ట్యా జిల్లా ప్రధాన కార్యాలయాలు, నగరాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో వాళ్లకు విధులు కేటాయించకూడదని ఆదేశాలు జారీ చేయడంతో పాటు రాష్ట్ర యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంది.
parliament monsoon session: రాజ్యసభ నుంచి 11 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్
ఇదిలా ఉండగా.. పీఎం డెవల్ మెంట్ ప్యాకేజీ కింద లోయలో 5,502 మంది కశ్మీరీ వలసదారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు హోం మంత్రిత్వ శాఖ ఈ రోజు (మంగళవారం) పార్లమెంటుకు తెలిపింది. అలాగే లోయలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వివిధ విభాగాలలో నియమితులైన కాశ్మీరీ వలస ఉద్యోగుల కోసం 6,000 ట్రాన్సిట్ వసతి గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం.. 2017 నుండి ఉగ్రవాదుల చేతిలో 28 మంది వలస కార్మికులు హతమయ్యారు, వీరిలో ఇద్దరు మహారాష్ట్రకు చెందినవారు, ఒకరు జార్ఖండ్ కు చెందిన వ్యక్తి ఉన్నారు. అలాగే 7 గురు బీహార్ కు చెందిన చెందినవారు ఉన్నారు. అయితే మధ్యప్రదేశ్ నుంచి ఎవరూ లేరు అని పార్లమెంటులోని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.
Lakhimpur Kheri violence Case : ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పార్లమెంటు రద్దు చేసిన తర్వాత లోయ నుంచి పండిట్ లు ఎవరూ వలస వెళ్లలేదని అంతకుముందు రాయ్ రాజ్యసభకు తెలియజేశారు. ‘‘ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం జీరో టోలెరెన్స్ విధానాన్ని అవలంభిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది ’’ అని ఆయన అన్నారు.