parliament monsoon session: రాజ్యసభ నుంచి 19 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్

Siva Kodati |  
Published : Jul 26, 2022, 03:14 PM ISTUpdated : Jul 26, 2022, 04:26 PM IST
parliament monsoon session: రాజ్యసభ నుంచి 19 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్

సారాంశం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతోన్న 19 మంది విపక్ష ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. 

రాజ్యసభ (rajya sabha) నుంచి 19 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. వీరిలో ఆరుగురు టీఎంసీ (tmc), ఇద్దరు డీఎంకే (dmk) ఎంపీలున్నారు. వీరిలో టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్, సంతాన్ సేన్ , డీఎంకే నుంచి కనిమొళి వున్నారు. 19 మంది ఎంపీలను వారం పాటు సభా కార్యక్రమాల నుంచి సస్పెండ్ చేశారు. నిన్న లోక్‌సభ (lok sabha) నుంచి కాంగ్రెస్ (congress) ఎంపీ మాణిక్యం ఠాగూర్ సహా నలుగురు కాంగ్రెస్ ఎంపీలను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సభా నియమాలను ఉల్లంఘించారంటూ వీరిపై చర్యలు తీసుకున్నారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (parliament monsoon session) మొదలైన నాటి నుంచి ధరల పెంపుపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న లోక్‌సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు విపక్ష సభ్యులు. ధరల పెంపుతో సామాన్యుల జీవితం భారంగా మారుతోందని ఫ్లకార్డులు ప్రదర్శించారు. సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారని.. నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు డిప్యూటీ స్పీకర్. 

Also Read:లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీల నిరసన: సెషన్ పూర్తయ్యే వరకు నలుగురు ఎంపీల సస్పెన్షన్

సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత సభ తిరిగి ప్రారంభమైన తర్వాత 20 నిమిషాల ముందు జీరో  అవర్ కి వాయిదా పడింది. అయితే ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తిరిగి సభలో నిరసనకు దిగారు.  ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఎంపీలపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పీకర్ ను కోరారు. పార్లమెంట్ కు వచ్చి పెదరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాలపై జీఎస్పీ పెంపును వెంటనే తగ్గించాలని విపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్