
Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షాల అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ( Yashwant Sinha) సంచలన ప్రకటన చేశారు. తన బాధను వ్యక్తం చేశారు. తాను ఇకపై మరే ఇతర రాజకీయ పార్టీలో చేరబోనని ప్రకటించారు. ఇటీవలి రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా భారతీయ జనతా పార్టీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన సిన్హా( Yashwant Sinha) అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ము చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడుగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో ఆ పదవీకి సిన్హా రాజీనామా చేశారు.
ప్రజా జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని యశ్వంత్ సిన్హా( Yashwant Sinha) అన్నారు. తాను ఇండిపెండెంట్‌గానే ఉంటాననీ, మరే ఇతర పార్టీలో చేరనని అన్నారు. తృణమూల్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు సిన్హా ఇలా బదులిచ్చారు. తనతో ఎవరూ మాట్లాడలేదనీ, తాను కూడా ఎవరితోనూ మాట్లాడలేదని అన్నాడు.
ప్రజా జీవితంలో క్రియశీలంగా ఉంటా- సిన్హా
తాను వ్యక్తిగతంగా తృణమూల్ నేతతో టచ్‌లో ఉన్నట్టు చెప్పారు. తాను ప్రజా జీవితంలో యాక్టివ్‌గా ఉంటాననీ, తన వయసు 84 ఏళ్ల అని, మరి ఎంతకాలం పని చేస్తానో చూడాలని అన్నారు. బీజేపీలో ఎన్నో సంవత్సరాలు రాజకీయ జీవితం అనుభవించిన ఆయన 2018లో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మార్చి 2021లో తృణమూల్‌లో చేరారు.