భారత ప్రయాణీకులపై యూకే వివక్ష.. కోవిషీల్డ్ ను గుర్తించకపోవడం దారుణం.. విదేశాంగ కార్యదర్శి

By AN TeluguFirst Published Sep 21, 2021, 5:03 PM IST
Highlights

యూకే కోవిషీల్డ్(Covishield) కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను  గుర్తించకపోవడం వివక్షాత్మకమైన విధానమని అన్నారు. ఇది UK కి వెళ్లాలనుకునే భారతీయులపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ : బోరిస్ జాన్సన్ (Boris Johnson) నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయాణికులకు కొత్త కోవిడ్ సంబంధిత ఆంక్షలను ప్రకటించడంపై వివాదం నెలకొంది. దీనిమీద విదేశాంగ కార్యదర్శి హర్ష్ శృంగ్లా (Harsh Shringla) మంగళవారం (సెప్టెంబర్ 21, 2021) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూకే కోవిషీల్డ్(Covishield) కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను  గుర్తించకపోవడం వివక్షాత్మకమైన విధానమని అన్నారు. ఇది UK కి వెళ్లాలనుకునే భారతీయులపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

"యూకే కొత్త  విదేశాంగ కార్యదర్శితో EAM సమస్యను బలంగా లేవనెత్తింది. ఈ సమస్య పరిష్కరించబడుతుందని కొన్ని హామీలు ఇచ్చారని నాకు తెలిసింది" అని విదేశాంగ శాఖ తెలియజేసింది. అంతకు ముందు రోజు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా కోవిడ్ -19 క్వారంటైన్ సమస్యను 'ముందుగానే పరిష్కరించాలని' కోరారు.

కొత్త నిబంధనల ప్రకారం, కోవిషీల్డ్ రెండు మోతాదులు వేసుకున్నభారతీయ ప్రయాణికులు టీకాలు తీసుకోనివారిగానే పరిగణించబడతారు. 10 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. భారత అధికారులు జారీ చేసిన COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికేషన్ గుర్తింపును ఎలా విస్తరించవచ్చో అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నామని UK తెలిపింది.

ఇదిలా ఉండగా, కోవిడ్ -19 కు రెండు టీకాలు పూర్తైన భారత్‌తో సహా 33 దేశాలకు చెందిన విమాన ప్రయాణికులకు అమెరికా నవంబర్‌లో తిరిగి దేశంలోకి అనుమతించనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈ చర్య వల్ల ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, గ్రీస్, అలాగే బ్రిటన్, ఐర్లాండ్, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌,బ్రెజిల్ తో సహా యూరప్‌లోని 26 స్కెంజెన్ దేశాల నుండి వ్యాక్సినేషన్ పూర్తైన విమాన ప్రయాణికులను అనుమతి లభిస్తుంది. ఈ ఆంక్షలు గత 14 రోజులుగా ఈ దేశాల్లో ఉన్న యూఎస్ యేతర పౌరులకు నిషేధించబడ్డాయి.
 

click me!