Punjab Govt సంచ‌ల‌న నిర్ణ‌యం.. నో వ్యాక్సిన్ సర్టిఫికెట్..నో శాలరీ..

Published : Dec 23, 2021, 07:14 AM IST
Punjab Govt సంచ‌ల‌న నిర్ణ‌యం..  నో వ్యాక్సిన్ సర్టిఫికెట్..నో శాలరీ..

సారాంశం

ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభించడంతో పంజాబ్ ప్రభుత్వం ( Punjab Govt) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందజేయని ప్రభుత్వ ఉద్యోగులకు జీతం నిలిపివేస్తామని ప్రకటించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.    


Punjab Govt:  దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే దాదాపు 200 కేసులు నమోదయ్యాయి. ఈ క్ర‌మంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆంక్ష‌ల‌ను క‌ఠినత‌రం చేస్తోన్నాయి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై బ్యాన్‌ విధించాయి. అలాగే.. బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించారు. షాపింగ్‌కు వచ్చేవాళ్లు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని , లేదంటే దుకాణాల్లోకి అనుమతించరాదని కూడా ఆదేశాలు జారీ చేశాయి. 
 
ఈ క్ర‌మంలో పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే..  జీతం పొందరని కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో ఉద్యోగులందరు అయోమయంలో పడ్డారు. ఒకరు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. మరొకరు ఒకే డోస్ వేసుకోవచ్చు. కానీ వారు తమ జీతం కావాలంటే పంజాబ్ ప్రభుత్వ జాబ్ పోర్టల్‌లో సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయాలి. అయితే టీకాలు వేయని ఉద్యోగుల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

Read Also: ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు.. రేపటి ఎగ్జిబిటర్స్ సమావేశం వాయిదా, ప్రభుత్వంపై గుర్తు
 
 అయితే... జనవరి 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, జనవరి 1వ తేదీ నాటికి వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను అంద‌జేస్తే.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే.. ఉద్యోగ విర‌మ‌ణ చేసి.. పింఛ‌న్ పొందుతున్న వారికి కూడా ఈ రూల్స్ వ‌ర్తిస్తాయ‌ని స్పష్టం చేసింది. క‌రోన వ్యాక్సిన్ సింగిల్ డోస్ తీసుకున్నా.. డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా.. టీకా సర్టిఫికేట్‌లను పంజాబ్ ప్రభుత్వ iHRMS ( Integrated Human Resource Management System) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇది జీతం చెల్లింపు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల ఉపసంహరణలను క్రమబద్ధీకరిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నా.. వ్యాక్సినేష‌న్ చేయించుకోవ‌డంతో ముంద‌డుగు వేయ‌డం లేదు. దీంతో ఇలాంటి  ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌భుత్వ ఉద్యోగుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న స్పంద‌న వ‌స్తోంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మ‌రి కొన్ని ఉద్యోగ సంఘాలు తిరస్క‌రిస్తోన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో.. చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ స‌ర్కార్ .. ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల‌పై ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఎన్నిక‌ల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Read Also: భారత పౌరసత్వం కోసం 7306 మంది పాకిస్థానీల దరఖాస్తులు..
 
ఇదిలా ఉంటే.. హర్యానా స‌ర్కార్ కూడా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వ్యాక్సినేష‌న్ చేయించుకోని వారిని వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో తిరగడాన్ని నిషేధించింది. రెండు డోసుల టీకాలు వేసుకున్న వ్యక్తులు మాత్రమే రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాలైన మాల్స్, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలను సందర్శించడానికి అనుమతి ఉంటుంది. ఈ నిబంధ‌న జ‌న‌వ‌రి 1 నుంచి అమ‌లులోకి వ‌స్తోంద‌ని ప్ర‌క‌టించింది.

Read Also: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూయర్ వేడుకలను రద్దు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

మరోవైపు.. ఢిల్లీ స‌ర్కార్ కూడా అలర్ట్ అయ్యింది.  క్రిస్మస్‌ , న్యూఇయర్‌ వేడుకల ఆంక్షాలు విధించింది.  బహిరంగ వేడుకలపై నిబంధ‌న‌లు విధించింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిర‌గాలంటే..  మాస్క్ త‌ప్ప‌ని స‌రి చేసింది.  దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో మోదీ పరిస్థితిని సమీక్షిస్తారు.
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !