భారత పౌరసత్వం కోసం 7306 మంది పాకిస్థానీల దరఖాస్తులు..

By SumaBala BukkaFirst Published Dec 23, 2021, 7:08 AM IST
Highlights

డిసెంబర్ 14  నాటికి 10,635 దరఖాస్తులు రాగా వాటిలో  7306 మంది పాకిస్తానీ లేనని వెల్లడించారు ఆఫ్గాన్ నుంచి 1152, శ్రీలంక, అమెరికా నుంచి 223, నేపాల్ నుంచి 189, బంగ్లాదేశ్ నుంచి 161, ఇతర ప్రాంతాల నుంచి 428 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.  అంతే కాకుండా భారత పౌరసత్వాన్ని కోరుతూ చైనా నుంచి 10 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఢిల్లీ : భారత పౌరసత్వం కోసం వివిధ దేశాల నుంచి ఈ ఏడాది డిసెంబర్ 14 నాటికి 10 వేలకు పైగా Applications రాగా వాటిలో 7306 మంది పాకిస్థానీలేనని 
Central Home Department వెల్లడించింది. అయితే వీటిలో 70 శాతం దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయని స్పష్టం చేసింది.  Indian citizenship కోరుతూ వచ్చిన దరఖాస్తు వివరాలను తెలియజేయాలని  Members of Parliament అడిగిన ప్రశ్నకు కేంద్రంఈ సమాధానం ఇచ్చింది.

 అంతేకాకుండా గడిచిన నాలుగేళ్లలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన 3117 మంది మైనార్టీలకు భారత పౌరసత్వ హోదా కల్పించినట్లు మరో ప్రశ్నకు బదులుగా తెలిపింది. భారత పౌరసత్వాన్ని కోరుతూ వచ్చిన దరఖాస్తుల పై సమాచారం ఇవ్వాలని  ఎంపి అబ్దుల్ వాహబ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. 

డిసెంబర్ 14  నాటికి 10,635 దరఖాస్తులు రాగా వాటిలో  7306 మంది పాకిస్తానీ లేనని వెల్లడించారు ఆఫ్గాన్ నుంచి 1152, శ్రీలంక, అమెరికా నుంచి 223, నేపాల్ నుంచి 189, బంగ్లాదేశ్ నుంచి 161, ఇతర ప్రాంతాల నుంచి 428 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.  అంతే కాకుండా భారత పౌరసత్వాన్ని కోరుతూ చైనా నుంచి 10 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

శత్రుదేశానికి అనుకోకుండా లక్షల డాలర్లు పంపిన తాలిబాన్లు.. ‘తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు’

ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ, సిక్కు, జైన్, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన వారి నుంచి భారత పౌరసత్వం కోరుతూ ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఎంతమందికి పౌరసత్వం ఇచ్చారని ఎంపీ కె. కేశవరావు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ మేరకు బదులిచ్చింది. 

ఇలాంటివి గడిచిన నాలుగేళ్లలో 8244 దరఖాస్తులు రాగా వాటిలో 3117 మందికి పౌరసత్వం జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడించారు. ఇదిలా ఉంటే, గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రం ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే.

కరెంట్ బిల్లు ఎగవేతదారుల్లో మంత్రి టాప్.. రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటన

ఇదిలా ఉండగా, అసలే కరువు.. ఆపై నిలిచిన విదేశీ సాయం.. రెండు దశాబ్దాల అంతర్యుద్ధంతో పతనం అంచులో దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇలాంటి పరిస్థితుల్లో Afghanistanను పాలిస్తున్న Talibanలు సొంతంగా బడ్టెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు ఇటీవలే కొన్ని ప్రకటనలు వచ్చాయి. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే, అంతకు మించి చిత్రంగా అనిపించే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆర్థికంతో సతమతం అవుతున్న సందర్భంలో ఆ దేశ పాలకులు తాలిబాన్లు పొరపాటున తమ శత్రు దేశానికి ఎనిమిది లక్షల డాలర్లను పంపింది. తమ డబ్బులు తమకు పంపించాల్సిందిగా ఆ దేశాన్ని అడగ్గా.. అది జరగని పని అని తెగేసి చెప్పినట్టు సమాచారం.

click me!