నాపై ఏ ఒత్తిడీ లేదు.. రెండురోజుల ముందే రాజీనామాకు సిద్ధమయ్యాను.. : యడియూరప్ప

By AN TeluguFirst Published Jul 26, 2021, 5:05 PM IST
Highlights

"రాజీనామా చేయమని నన్ను ఎవ్వరూ ఒత్తిడి చేయలేదు. బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన తర్వాత మరొకరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేలా నేను స్వయంగా రాజీనామా చేశాను. వచ్చే ఎన్నికల్లో బిజెపిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నేను కృషి చేస్తాను" అని తన రాజీనామాను కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ కు అప్పగించిన తరువాత యెడియరప్ప చెప్పారు.

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరువాత, బిఎస్ యెడియరప్ప మాట్లాడుతూ, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ళు పూర్తి చేసుకుందని, తాను ఏ ఒత్తిడికి లోనుకాకుండా వేరొకరికి దారి ఇచ్చానని అన్నారు. 2023లో జరిగే కర్ణాటక ఎన్నికలలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.

"రాజీనామా చేయమని నన్ను ఎవ్వరూ ఒత్తిడి చేయలేదు. బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన తర్వాత మరొకరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేలా నేను స్వయంగా రాజీనామా చేశాను. వచ్చే ఎన్నికల్లో బిజెపిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి నేను కృషి చేస్తాను" అని తన రాజీనామాను కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ కు అప్పగించిన తరువాత యెడియరప్ప చెప్పారు.

తాను తన వారసులెవ్వరినీ సిఫారసు చేయలేదని కూడా చెప్పారు. ‘"బిజెపి హైకమాండ్ ఎవర్ని కొత్త సిఎంగా ఎన్నుకున్నా.. వారి కింద మేం పని చేస్తాం. నేను, నా మద్దతుదారులు 100 శాతం వారితో కలిసి పనిచేస్తాం. అసంతృప్తికి తావేలేదని,  ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని ఆయన విలేకరులతో అన్నారు.

ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేసినా.. ఒక్కసారి కూడా పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగలేకపోయారు యెడియరప్ప. అంతేకాదు తాను రెండు రోజుల క్రితమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. తన స్థానంలో మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారన్న ఊహాగానాలకు చెక్ పెట్టారు. 

యడియూరప్ప రాజీనామా: బిజెపి అధిష్టానం పరిశీలనలో ఉన్న నేతలు వీరే

యడ్యూరప్పను మార్చడం వల్ల ప్రభుత్వాన్ని అస్థిర పరచొద్దని లింగయత్ నాయకులు బీజేపీని బహిరంగంగానే కోరారు. ఆయన వారితో సమావేశమయ్యారు. ఇవన్నీ చివరివరకు ఆయన రాజీనామాను సాగదీసినట్లు, పదవిలో కొనసాగడానికి చివరినిమిషం వరకు పోరాడినట్లు తెలుస్తోంది. 

యడ్యూరప్ప రాజీనామా తనకు ఆశ్చర్యం కలిగించిందని, జూలై 26 లోగా తాను హైకమాండ్ నుండి అనుకూలమైన నిర్ణయం వస్తుందని ఆయన నాకు చెప్పారని రాష్ట్ర మంత్రి కె సుధాకర్ అన్నారు. అయితే మనమందరం పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాలి అని కూడా అన్నారు. 

ముఖ్యమంత్రిగా యడియూరప్ప రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. తన ప్రభుత్వం రెండేళ్ల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన కంటతడి పెట్టారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఉద్వేగాన్ని నిలువరించుకోలేకపోయారు.  తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 

అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరాలని అడిగారని, అయితే తాను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని చెప్పానని ఆయన అన్నారు. కర్ణాటక శాసనసభలో ఆయన మాట్లాడారు. 

ఎళ్ల వేళలా తనకు అగ్నిపరీక్ష ఎదరువుతూనే ఉన్నదని, గత రెండేళ్ల పాటు కోవిడ్ ఇబ్బంది పెట్టిందని ఆయన అన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన మాట్లాడారు. రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపినట్లు తెలిపారు. 

కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా: రెండేళ్ల వార్షికోత్సవ సభలో కంటతడి
2019 లో జనతాదళ్ సెక్యులర్-కాంగ్రెస్ ప్రభుత్వం పరాజయం పాలైన తరువాత యడియురప్ప నాల్గవసారి అధికారంలోకి వచ్చారు. 17 మంది ఎమ్మెల్యేలు ఆకస్మిక రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం మైనారిటీలో పడేసి, బిజెపిలో చేరి ఎన్నికలలో పోటీ చేశారు. వారిలో చాలా మందిని మంత్రులుగా చేశారు.

అవినీతి ఆరోపణలు, "నిరంకుశ" పనితీరు,  చిన్న కుమారుడు బివై విజయేంద్ర పరిపాలనలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలపై సొంతపార్టీ  సహచరుల నుంచే యెడియరప్ప తొలగించాలని వాదనలు వచ్చాయి.
 

click me!