దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు: శరద్ పవార్

Published : Sep 05, 2023, 05:15 PM IST
దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు: శరద్ పవార్

సారాంశం

Mumbai: దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. భారతదేశ‌ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుండి 10 వరకు న్యూఢిల్లీలో G20 సమ్మిట్ జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ క్ర‌మంలోనే అందించిన జీ20 స‌మ్మిట్ విందు ఆహ్వానంలో రాష్ట్రపతిని "భారత్ ప్రెసిడెంట్" అని పేర్కొన‌డంపై ఆయ‌న స్పందిస్తూ ప‌వార్ ఈ వ్యాఖ్య‌లు  చేశారు.   

Nationalist Congress Party president Sharad Pawar: దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. భారతదేశ‌ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుండి 10 వరకు న్యూఢిల్లీలో G20 సమ్మిట్ జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ క్ర‌మంలోనే అందించిన జీ20 స‌మ్మిట్ విందు ఆహ్వానంలో రాష్ట్రపతిని "భారత్ ప్రెసిడెంట్" అని పేర్కొన‌డంపై ఆయ‌న స్పందిస్తూ ప‌వార్ ఈ వ్యాఖ్య‌లు  చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. జీ20 విందు ఆహ్వానంలో రాష్ట్రపతిని 'భారత రాష్ట్రపతి'గా పేర్కొంటారంటూ కాంగ్రెస్ పేర్కొన్న నేపథ్యంలో దేశం పేరును మార్చే హక్కు ఎవరికీ లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని ఎదుర్కోవాలనే లక్ష్యంతో 28 పార్టీలతో కూడిన ఇండియా కూటమిలో భాగమైన పార్టీల అధినేతలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ఏర్పాటు చేసే సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని శరద్ పవార్ తెలిపారు.

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్సీపీ చీఫ్ మాట్లాడుతూ దేశానికి సంబంధించిన ఓ పేరుపై అధికార పార్టీ ఎందుకు ఆందోళన చెందుతోందో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగంలో భారతదేశం పేరును మారుస్తారా అని అడిగిన ప్రశ్నకు శరద్ పవార్ సమాధానమిస్తూ, దానిపై తనకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బుధవారం ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీల అధినేతలతో సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. దీనిపై సమావేశంలో చర్చిస్తామన్నారు. అయితే దేశం పేరును మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. పేరును ఎవరూ మార్చలేరని ఎన్సీపీ చీఫ్ అన్నారు.

జీ-20 విందు ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతిని 'భారత రాష్ట్రపతి'గా పేర్కొనడం వల్ల 'యూనియన్ ఆఫ్ స్టేట్స్'పై మోడీ ప్రభుత్వం దాడి చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరుగనుండగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu