పంజాబ్ లో పవర్ కట్.. అమరీందర్ సింగ్ పై సిద్దూ ఘాటు విమర్శలు..

By AN TeluguFirst Published Jul 2, 2021, 3:54 PM IST
Highlights

పంజాబ్ ముఖ్యమంతి కెప్టెన్ అమరీందర్ సింగ్ పై నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విరుచుకుపడ్డారు. పంజాబ్ లో పవర్ కట్ మీద సీఎం పదునైన విమర్శలు చేశారు. ఒకవైపు కెప్టెన్ ను కార్నర్ చేస్తూనే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు. 
 

పంజాబ్ ముఖ్యమంతి కెప్టెన్ అమరీందర్ సింగ్ పై నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విరుచుకుపడ్డారు. పంజాబ్ లో పవర్ కట్ మీద సీఎం పదునైన విమర్శలు చేశారు. ఒకవైపు కెప్టెన్ ను కార్నర్ చేస్తూనే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు. 

ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధరకు విద్యుత్ ను పంజాబ్ కొనుగోలు చేస్తోందన్న ఆయన ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుందని, అయితే తప్పుడు నిబంధనల కారణంగా 5,400 కోట్ల రూపాయలను వృధాగా చెల్లించారని, ఇప్పుడు స్థిర ఛార్జీల పేరుతో 65,000 కోట్లు రూపాయలను పంజాబ్ ప్రజల డబ్బును చెల్లించాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

విద్యుత్ ధరలు, విద్యుత్ కోతలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వాస్తవాలు తెలియాలి. పంజాబ్ ప్రజలకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎలా ఇవ్వాలనే దానిమీద సమాలోచనలు చేయాలి. దానికి కొన్ని మార్గాలను అవలంబించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కార్యలయంలో పాలనా సమయాలు మార్చుకోవడంతోనే ప్రజల ఇళ్లలో ఏసీలు ఆపేయడంతోనో కాకుండా నిర్థిష్టమైన కార్యాచరణ ఉంటే సరిపోతుంది’ అని ముఖ్యమంత్రి అమరీందర్ పై విమర్శలు చేశారు. 

ఇక పంజాబ్ లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా విమర్శలు గుప్పించారు. పంజాబ్ కు కాపీ మోడల్ అవసరం లేదని అన్న సిద్దూ.. పంజాబ్ ప్రభుత్వం సబ్సిడీ కింద 9,000 కోట్లు చెల్లిస్తోందని, కేవలం 1,699 కోట్లు చెల్లిస్తున్న ఢిల్లీ నేతలు పంజాబ్ కు ఏ విధంగా సరిపడా విద్యుత్ అందిస్తారని ఎద్దేవా చేశారు. పంజాబ్ కు పంజాబ్ మోడలే కావాలని మరే ఇతర కాపీ మోడల్ అవసరం లేదని సిద్ధూ తేల్చి చెప్పారు. 

click me!