దర్భాంగా పేలుడు: మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 2, 2021, 3:53 PM IST
Highlights

బీహార్ రాష్ట్రంలోని దర్బాంగా రైల్వే స్టేషన్ లో పేలుడు ఘటనలో  లష్కరే తోయిబాకు చెందిన  మరో ఇద్దరు  ఉగ్రవాదులను  ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన ఇద్దరు సోదరులు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: బీహార్ రాష్ట్రంలోని దర్బాంగా రైల్వే స్టేషన్ లో పేలుడు ఘటనలో  లష్కరే తోయిబాకు చెందిన  మరో ఇద్దరు  ఉగ్రవాదులను  ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన ఇద్దరు సోదరులు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.లష్కరే తోయిబాకు చెందిన సలీం, కాఫిల్ అనే ఇద్దరిని శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

also read:దర్బాంగా పేలుడు: ఫేక్ పాన్ కార్డు, మొబైల్‌ సమాచారంతో పార్శిల్ బుకింగ్

 

బీహార్ రాష్ట్రంలోని దర్బాంగా రైల్వే స్టేషన్ లో పేలుడు ఘటనలో లష్కరే తోయిబాకు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన ఇద్దరు సోదరులు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. pic.twitter.com/YzsPZ9rrQ7

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 

దర్బాంగా పేలుడు ఘటనకు సికింద్రాబాద్ నుండి పంపిన పార్శిల్ కారణంగా పేలుడు వాటిల్లిందని తొలుత గుర్తించారు. ఈ పార్శిల్  ఆధారంగా విచారణ జరిపిన ఎన్ఐఏకు హైద్రాబాద్ కేంద్రంగా ఇమ్రాన్, నాసిర్ సోదరులు ప్లాన్ చేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. 

వీరిద్దరిని విచారించిన సమయంలో యూపీకి చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదుల సమాచారం వెల్లడించారు హైద్రాబాద్ కు చెందిన ఇమ్రాన్, నాసిర్ లు.  హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. హైద్రాబాద్ నుండి బీహార్ రాష్ట్రానికి శుక్రవారం నాడు తరలించారు.
 

click me!