దర్బాంగా పేలుడు కేసు: పాట్నాకు ఇద్దరు నిందితులు తరలింపు.. స్టేట్‌మెంట్ రికార్డు

By Siva KodatiFirst Published Jul 2, 2021, 3:49 PM IST
Highlights

దర్భాంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులు మహ్మద్ నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్‌లను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు.. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పాట్నా తరలించారు

దర్భాంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులు మహ్మద్ నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్‌లను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు.. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పాట్నా తరలించారు. నిందితులిద్దరిని పాట్నా కోర్టులో హాజరుపరిచి తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్ మల్లేపల్లిలోని నిందితుల ఇళ్లలో పలు కీలక పత్రాలు, పేలుడు పదార్ధాలకు సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో వీరికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ హబీబ్ నగర్ బడే మసీదు వద్ద ఇద్దరు అన్నాదమ్ములు ఇమ్రాన్, నాసిర్‌లను అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. దర్బాంగా రైల్వేస్టేషన్‌లో పేలుడుకు సంబంధించిన వివరాలను రికార్డు చేయనున్నారు. పేలుడు వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. 

Also Read:దర్బాంగా పేలుడు: ఫేక్ పాన్ కార్డు, మొబైల్‌ సమాచారంతో పార్శిల్ బుకింగ్

కాగా, బీహార్ లోని దర్భాంగా పేలుడు ఘటనకు స్కెచ్ వేసిన  లష్కరే తోయిబా ఉగ్రవాదులు  పకడ్బందీ ప్లాన్  వేశారు. పేలుడు తర్వాత పోలీసు దర్యాప్తులో  తమ ఉనికి  కన్పించకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. కానీ, నిందితులు మాత్రం పోలీసులకు చిక్కారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  నుండి వచ్చిన పార్శిల్ కారణంగానే పేలుడు చోటు చేసుకొందని బీహారో రైల్వేస్టేషన్  ఘటన విచారణ అధికారులు గుర్తించారు.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో  ఇమ్రాన్ , నాసిర్  సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు ఆధారాలను పార్శిల్ బుక్ చేసే సమయంలో నిందితులు ఇచ్చారు.

click me!