కాంగ్రెస్‌తో పొత్తా... ఆలోచనలోపడ్డ ప్రాంతీయ పార్టీలు: ఒంటరిగానే జేడీఎస్, దేవెగౌడ తేల్చేశారా

Siva Kodati |  
Published : Mar 13, 2022, 03:05 PM IST
కాంగ్రెస్‌తో పొత్తా... ఆలోచనలోపడ్డ ప్రాంతీయ పార్టీలు: ఒంటరిగానే జేడీఎస్, దేవెగౌడ తేల్చేశారా

సారాంశం

కాంగ్రెస్ పార్టీతో  పొత్తు పెట్టుకునేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పార్టీలు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో కర్ణాటక రాష్ట్రానికి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేది లేదని జేడీఎస్ అధినేత దేవెగౌడ పరోక్ష సంకేతాలిచ్చేశారు. 

అసలే ప్రాభవాన్ని  కోల్పోతోన్న కాంగ్రెస్ పార్టీకి ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు (five state elections) మరింత షాకిచ్చాయి. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోగా.. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లలో సత్తా చాటలేకపోయింది. కేవలం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో మాత్రమే ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో వుంది. ఈ నేపథ్యంలో మునుపటి ఫాంను కాంగ్రెస్ అందుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీతో పొత్తుకు కూడా ప్రాంతీయ పార్టీలు దూరంగా వుండే పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తును పరిశీలిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. తాము అటువంటి భాగస్వామ్యాల గురించి ఆలోచించడం లేదన్నారు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుని పార్టీని బలోపేతం చేసుకుంటాం అని దేవెగౌడ వ్యాఖ్యానించారు. పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమికి.. రైతుల ఆందోళన, పార్టీ అంతర్గత అంశాలు కారణమని, ఇది ఆప్ కు చక్కని అవకాశంగా మారిందని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. పంజాబ్ ప్రజలు బీజేపీని ఎంపిక చేసుకోలేదు అని ఆయన చెప్పారు. మూడు పార్టీల మధ్య పోరుతో కర్ణాటకలో ఫలితం ఎవరికి అనుకూలిస్తుందో చూడాలి. అయితే రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామన్న నమ్మకంతో సీఎం బస్వరాజ్ బొమ్మై ఉన్నారు.

కాగా.. Congress పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఆదివారం నాడు సాయంత్రం జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన ఫలితాలు ఆ పార్టీకి దక్కలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత  అసమ్మతి నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

2021 అక్టోబర్ మాసంలో CWC  సమావేశమైంది.  సీడబ్ల్యుసీలో  పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత సహా 23 మంది సభ్యులుంటారు. ఈ 23 మందిలో 12 మంది ఎఐసీసీ ద్వారా ఎన్నుకోబడిన 12 మంది సభ్యులుంటారు.  ఐదు రాష్ట్రాల Assembly ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. 2017 ఎన్నికల్లో Punjab లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు దక్కించుకొంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. Uttarakhand, Goa, Manipurరాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ మెరుగైన సీట్లు దక్కించుకోలేదు.

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం విన్పిస్తున్న G-23 నేతలు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  ఎఐసీసీ కొత్త అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని కూడా అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ నెల 11వ తేదీన New Delhi లోని జీ 23కి నాయకత్వం వహిస్తున్న Ghulam Nabi Azad నివాసంలో కపిల్ సిబల్, మనీష్ తివారీ తదితరులు భేటీ అయ్యారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu