అమృత్‌సర్‌లో ఆప్ ర్యాలీ: స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న కేజ్రీవాల్

Published : Mar 13, 2022, 02:57 PM IST
అమృత్‌సర్‌లో ఆప్ ర్యాలీ: స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న కేజ్రీవాల్

సారాంశం

పంజాబ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న భగవంత్ మాన్ లతో కలిసి అమృత్‌సర్ లో ర్యాలీ నిర్వహించారు.

చండీఘడ్: Punjab రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో ఆదివారం నాడు ఆప్ కన్వనర్, ఢిల్లీ సీఎం Arvind Kejriwal , పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న Bhagwant Mann  లు ర్యాలీ నిర్వహించారు.

పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న భగవంత్ మాన్  తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ లు ఇవాళ ఉదయం Amritsar లోని జలియన్ వాలా బాగ్ స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం Delhi  సీఎం కేజ్రీవాల్ అమృత్‌సర్ లోని Golden Temple సందర్శించారు.  ఆలయంలో ఆయన ప్రార్ధనలు నిర్వహించారు. ఆప్ నుండి విజయం సాధించిన 92 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిరోమణి గురు ద్వారా ప్రభంధక్ కమిటీ పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపటటనున్న భగవంత్ మాన్ , ఢిల్లీ సీఎంలను  సన్మానించింది.

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 92 అసెంబ్లీ స్థానాల్లో AAP విజయం సాధించింది. ఈ విజయంతో  ఆప్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ దఫా ఆ పార్టీ 18 స్థానాలకే పరిమితమైంది.

ఆప్ ప్రభంజనంలో ఈ దఫా ఎన్నికల్లోCongress, SAD  కు చెందిన ప్రముఖులు కూడా ఘోర ఓటమిని చవి చూశారు. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 16న భగవంత్ సింగ్ మాన్ ప్రమాణం చేయనున్నారు. మాన్ ఒకకడే ఈ నెల 16న ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. తన మంత్రివర్గ సహచరులతో మాన్ మరోసారి ప్రమాణం చేయించే అవకాశం ఉంది.

పంజాబ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన తర్వాత భగవంత్ సింగ్ మాన్ ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో ఆప్ కన్వీనర్, అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. కేజ్రీవాల్ ఆశీర్వాదం తీసుకొన్నారు. ఈ నెల 16న ప్రమాణం చేయనున్నందున ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

పంజాబ్ లో ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో మొత్తం 117 స్థానాలకు ఫపోలింగ్ జరిగింది. మొత్తం 2.14 కోట్ల ఓటర్లు ఉండగా.. 72 శాతం పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇది 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది. పంజాబ్‌లో 2017లో 77.4 శాతం పోలింగ్ నమోదైంది.

పంజాబ్‌లో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉండగా ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. ఇక, పంజాబ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారన్ని నిలుపుకోవాలని చూస్తోంది. పంజాబ్‌లో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్​ఏడీ బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడించిం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ 77 సీట్లలో, ఆప్​ 20 చోట్ల గెలిచింది. ఎస్​ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈసారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్‌‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక, సాగు చట్టాల విషయంలో బీజేపీకి దూరం జరిగిన ఎస్‌ఏడీ.. ఈ ఎన్నికలల్లో బీఎస్పీతో జట్టు కట్టింది. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, బాదల్ నేతృ‌త్వం‌లోని ఎస్‌‌ఏడీ (సం‌యు‌క్త)తో కలిసి బరి‌లోకి దిగింది.

పంజాబ్ ఎన్నికల బరిలో..  ప్రస్తుతం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. చౌమ్‌కౌర్ సాహిబ్, Bhadaur రెండు స్థానాల నుంచి బరిలో ఉన్నారు. పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.. అమృత్‌సర్ ఈస్ట్, మాజీ సీఎం అమరీందర్ సింగ్.. పటియాలా, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్, ఆప్​ సీఎం అభ్యర్థి Bhagwant Mann.. ధురి, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్.. లాంబి, పంజాబ్​ బీజేపీ చీఫ్​ అశ్వనీ శర్మ.. పఠాన్‌కోట్ స్థానాల నుంచి ఎన్నిక బరిలో నిలిచారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu