భారత్ జోడో యాత్రతో నా అహంకారం పోయింది: మోడీ సర్కార్ పై అవిశ్వాస చర్చలో రాహుల్

Published : Aug 09, 2023, 12:42 PM ISTUpdated : Aug 09, 2023, 12:50 PM IST
భారత్ జోడో యాత్రతో నా అహంకారం పోయింది: మోడీ సర్కార్ పై  అవిశ్వాస చర్చలో  రాహుల్

సారాంశం

భారత్ జోడో యాత్రలో  తన అనుభవాలను  రాహుల్ గాంధీ లోక్ సభలో తెలిపారు. ప్రజల కష్టాలను దగ్గరుండి చూసినట్టుగా  చెప్పారు. మోడీ ప్రభుత్వంపై  అవిశ్వాస చర్చలో  రాహుల్ గాంధీ  ఇవాళ పాల్గొన్నారు.

 న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర తన అహంకారాన్ని అణచివేసిందని  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై  కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది.అవిశ్వాసంపై  బుధవారంనాడు లోక్ సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.  

గతంలో  అదానీ గురించి మాట్లాడినప్పుడు  ఓ పెద్దనేతకు  ఇబ్బంది అనిపించిందేమోనని పరోక్షంగా  ప్రధానిపై  రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. అదానీ గురించి ఈ రోజు మాట్లాడను, మీరు భయపడాల్సిన పనిలేదన్నారు. తనది రాజకీయ ప్రసంగం కాదన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు  పాదయాత్ర చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.

also read:Congress: గుజ‌రాత్ నుంచి మేఘాల‌య వ‌ర‌కు రాహుల్ గాంధీ 'భార‌త్ జోడో యాత్ర‌-2'

భారత్ జోడో యాత్ర ఇంకా ముగియలేదన్నారు. లడ్డాఖ్ వరకు  తాను  యాత్ర చేస్తానని  రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ యాత్రలో  ప్రజల సమస్యలను తాను  దగ్గరుండి చూసినట్టు చెప్పారు. పాదయాత్రలో అనేక అంశాలను తాను  నేర్చుకున్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజల కష్టాలను దగ్గరుండి చూసినట్టుగా ఆయన  గుర్తు  చేసుకున్నారు.లక్షల మంది  తనతో కలిసి రావడంతో తనకు  ధైర్యమొచ్చిందని ఆయన తెలిపారు. పాదయాత్ర చేసే సమయంలో తనలో కొద్ది కొద్దిగా అహంకారం మాయమైందని ఆయన వివరించారు. పాదయాత్రలో  తాను  అనేక విషయాలను నేర్చుకున్నట్టుగా రాహుల్ గాంధీ  చెప్పారు.

2022  సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుండి రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్రను  ప్రారంభించారు.12 రాష్ట్రాల గుండా  3,970 కి.మీ. సాగింది.  ఈ ఏడాది జనవరి  30వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో  పాదయాత్ర ముగిసింది.  130  రోజుల పాటు ఈ యాత్ర  సాగింది. భారత్  జోడో యాత్ర  రెండో విడత  గుజరాత్ నుండి ప్రారంభించనున్నారు రాహుల్ గాంధీ. గుజరాత్ నుండి  మేఘాలయ వరకు  పాదయాత్రను ప్రారంభించాలని  కాంగ్రెస్  పార్టీ ప్లాన్ చేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?