పరువు హత్య : తమ మతంకాని వ్యక్తితో తిరుగుతోందని.. బాలికను కొట్టి చంపిన తండ్రి, అన్న..

Published : Aug 09, 2023, 11:54 AM IST
పరువు హత్య : తమ మతంకాని వ్యక్తితో తిరుగుతోందని.. బాలికను కొట్టి చంపిన తండ్రి, అన్న..

సారాంశం

వేరే సామాజికవర్గానికి చెందిన యువకుడితో ప్రేమలో పడిందని.. ఓ యువతిని ఆమె అన్న, తండ్రి దారుణంగా కొట్టి చంపారు. ఆ తరువాత హడావుడిగా పూడ్చిపెట్టారు. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య కలకలం రేపుతోంది. అమేథీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని హత్య జరిగింది. తమ సామాజిక వర్గానికి కాకుండా ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో తిరుగుతోందనే కారణంతో ఆమె కుటుంబ సభ్యులే ఆమెను దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు.

బాధితురాలి పేరు అఫ్రీన్. ఆమెను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆగస్టు 5 తెల్లవారుజామున పూడ్చిపెట్టారు. ఆ తరువాత, ఆమె అనారోగ్యంతో చనిపోయిందని ఊర్లో వారికి చెప్పారని పోలీసులు తెలిపారు. అయితే, ఆమె మృతి మీద అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

ఆరేళ్లు ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని.. ఆ తరువాత అత్యాచారం కేసు పెడితే చెల్లదు : హైకోర్టు..

జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలిక మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇది పరువు హత్య కేసు అని పోలీసులు తెలిపారు. ఆగస్టు 4న, అఫ్రీన్ తండ్రి,  సోదరుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

బాలిక స్థానిక మార్కెట్‌లో ఒక యువకుడితో కలిసి షికారు చేస్తుండగా, ఆమె తండ్రి నియామత్ ఉల్లా, సోదరుడు హైదర్ అలీ ఆమెను పట్టుకుని బహిరంగంగా కొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొందరు స్థానికులు వీడియోను రికార్డ్ చేసి పోలీసులకు సమాచారం అందించారు, దీంతో ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు.

బాలిక తన కుటుంబ సభ్యులతో ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడలేదు, అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో అంగీకరించింది. గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం, ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబం అఫ్రీన్‌ను తీవ్రంగా కొట్టారు. ఫలితంగా ఆమె చనిపోయిందని పోలీసులు తెలిపారు.

ఇది పరువు హత్య కేసు అని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 304 (అపరాధపూరితమైన హత్య) కింద బాధితురాలి తండ్రి, సోదరుడిపై కేసు నమోదయ్యింది.

"ట్విటర్‌లో ఒక వీడియో వైరల్ అయ్యింది. పోలీసులు దీనిమీద దర్యాప్తు ప్రారంభించారు. మైనర్‌ను హడావిడిగా పాతిపెట్టినట్లు తెలిసింది" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?