సచిన్ పైలెట్ వర్గానికి ఊరట: ఈ నెల 24 వరకు చర్యలొద్దని హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Jul 21, 2020, 3:12 PM IST
Highlights

 ఈ నెల 24వ తేదీ వరకు సచిన్ పైలెట్ నేతృత్వంలోని అసమ్మతి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు స్పీకర్ ను ఆదేశించింది.
 

జైపూర్:  ఈ నెల 24వ తేదీ వరకు సచిన్ పైలెట్ నేతృత్వంలోని అసమ్మతి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు స్పీకర్ ను ఆదేశించింది.

తమకు స్పీకర్ జారీ చేసిన నోటీసులపై సచిన్ పైలెట్ సహా 18 మంది ఎమ్మెల్యేలు రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై మంగళవారం నాడు రాజస్థాన్ హైకోర్టు మూడు రోజుల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్ ను కోరింది.

also read:రాజస్థాన్‌ సంక్షోభంలో మరో ట్విస్ట్: ఫోన్ ట్యాపింగ్‌పై రిపోర్టు కోరిన కేంద్రం

మరో మూడు రోజుల పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సచిన్ పైలెట్ వర్గానికి ఊరట లభించినట్టైంది.సీఎల్పీ మీటింగ్ ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైంది. రెండు గంటలు ఆలస్యంగా ఈ సమావేశం స్టార్ట్ అయింది. సీఎల్పీ  సమావేశం తర్వాత ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు కేబినెట్ సమావేశం కానుంది.

రెబెల్ ఎమ్మెల్యేలపై అపన్హత వేటు వేయాలని కోరుతూ చీఫ్ విప్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నోటీసుల నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు సచిన్ పైలెట్ వర్గం.

click me!