Nitish Kumar: 5 కంటే ఎక్కువ సార్లు సీఎం అయినవారి జాబితా ఇదే

By Mahesh K  |  First Published Jan 29, 2024, 5:25 AM IST

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ తొమ్మిదో సారి ప్రమాణం చేశారు. ఇన్ని సార్లు మన దేశంలో ముఖ్యమంత్రిగా ఎవరూ ప్రమాణం చేయలేదు. నితీశ్ కుమార్‌ను మినహాయిస్తే గరిష్టంగా ఆరు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ఇద్దరు ఉన్నారు. 
 


Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదివారం మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది వరకు ఆయన 8 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం తీసుకున్నారు. తాజాగా, 9వ సారి ప్రమాణం చేశారు. ఒక రాష్ట్రానికి 9 సార్లు సీఎంగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మినహా మరెవరూ లేరు. అయితే, ఒకటి కంటే ఎక్కువ సార్లు సీఎంగా ప్రమాణం తీసుకున్నవారు చాలా మంది ఉద్దండులే ఉన్నారు. అయితే, 5 సార్లు లేదా.. అంతకంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వారి గురించి తెలుసుకుందాం.

అత్యధిక సార్లు నితీశ్ కుమార్ 9 సార్లు ప్రమాణం తీసుకున్నారు. నిజానికి 9 సార్లు ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి మన దేశంలో లేనేలేరు. 9 తర్వాత హైయెస్ట్ 6గా ఉన్నది. ఇద్దరు నేతలు మాత్రమే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. తమిళనాడు మాజీ సీఎం జే జయలలిత ఆరు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అదే విధంగా హిమాల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్ ఆరు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు.

Latest Videos

ఇక మన దేశంలో ఐదు సార్లు సీఎం అయినవారు ఆరుగురు ఉన్నారు. సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన పవన్ కుమార్ చామ్లింగ్ ఆరుసార్లు సీఎంగా చేశారు. పి లాల్ తన్హావల్లా కూడా మిజోరం రాష్ట్రానికి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇక ఒడిశా ముుఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ఆరు సార్లు బాధ్యలు తీసుకున్నారు. ఎం కరుణానిధి తమిళనాడు రాస్ట్రానికి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు . జ్యోతి బసు పశ్చిమ బెంగాల్‌లో‌కు ఆరు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. పర్కాష్ సింగ్ బాదల్ పంజాబ్ రాష్ట్రానికి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. 

కాగా, మాణిక్ సర్కారు నాలుగు సార్లు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందించారు.

నితీశ్ కుమార్ తొమ్మిది సార్లు ప్రమాణం చేసిన పదవీకాలంలో మాత్రంపైన పేర్కొన్న వారందరికంటే తక్కువ కాలమే అధికారంలో ఉన్నారు. 

click me!