ఒకరితో పెళ్లి, ఇంకొకరితో ఎఫైర్ నితీష్ కుమార్ కు అలవాటే - కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

By Sairam Indur  |  First Published Jan 28, 2024, 2:23 PM IST

జేడీ(యూ) చీఫ్ (JDU), బీహార్ ఆపద్ధర్మ సీఎం నితీష్ కుమార్ (Nitish kumar)పై కాంగ్రెస్ నాయకుడు తారిఖ్ అన్వర్ (Congress Leader Tariq Anwar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరిని పెళ్లి చేసుకోవడం, మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం ఆయనకు అలావాటుగా మారిందని మండిపడ్డారు.


బీహార్ లో రాజకీయాలు ఒక్క సారిగా మారిపోయాయి. ఇండియా కూటమి ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన జేడీ(యూ) చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఓ సందర్భంగా ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఆయనే అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇండియూ కూటమిలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన ఆకస్మికంగా దాని నుంచి వైదొలుగుతున్నట్టు, కేంద్రంలోని అధికార ఎన్డీఏలో చేరబోతున్నట్టు ప్రకటించారు. 

బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. త్వరలో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు

Latest Videos

ఈ మేరకు ఆదివారం ఉదయం బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిని గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరారు. కాగా.. బీహార్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నితీశ్ కుమార్ పై కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ మండిపడ్డారు. ఒకరిని పెళ్లి చేసుకోవడం, మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం కుమార్ కు అలవాటుగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రామ్ లల్లా శిల కోసం నా భార్య తాళి తాకట్టు పెట్టా..- కాంట్రాక్టర్ శ్రీనివాస్

బీహార్ సీఎంగా రాజీనామా చేయడం, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరటంపై ఆయన తారిఖ్ అన్వర్ స్పందిస్తూ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ ఓ పోస్టు పెట్టారు. ‘‘ఆశ్చర్యం ఏమీ లేదు. ఒకరితో వివాహం, మరొకరితో ఎఫైర్. ఇది నితీష్ కుమార్ నైజంగా మారింది’’ అని ఆయన పేర్కొన్నారు.

आश्चर्य की कोई बात नहीं है।शादी किसी के साथ और अफेयर किसी दूसरे के साथ।नीतीश कुमार का स्वभाव बन चुका है।

— Tariq Anwar (@itariqanwar)

 కాగా.. శనివారం కూడా ఆయన ఈ పరిణామాలపై స్పందించారు. మళ్లీ కూటమి మారడం నితీష్ కుమార్ ఇమేజ్ కు మంచిది కాదని సూచించారు. ఆయన మహాకూటమి నుంచి వైదొలగటం తమకు నష్టమేనని, కానీ ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీలతో కలిసి దీనిని ఎదొర్కొంటామని ఆయన తెలిపారు. బీహార్ లో తలెత్తుతున్న రాజకీయ అస్థిరతను బీజేపీయే సృష్టిస్తోందని అన్నారు. ఎందుకంటే ఆ పార్టీ ఇండియా కూటమిపై చాలా ఆందోళన చెందుతోందని ఆరోపించారు. ‘‘నితీష్ కుమార్ తన, తన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ఎలాంటి చర్యలు తీసుకోరని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. ఆయన ఇప్పటికే రెండుసార్లు పార్టీ మారారని, మూడోసారి అలా చేస్తే బీహార్ ప్రజల దృష్టిలో ఆయన ఇమేజ్ నాశనమవుతుంది’’ అని చెప్పారు. 

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపు..

ఇదిలా ఉండగా.. బీహార్ సీఎంగా రాజీనామా చేసిన అనంతరం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కూటమిలో పరిస్థితులు సరిగా లేవని, తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించానని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కూడా కోరానని చెప్పారు. కాగా.. నేటి సాయంత్రం బీజేపీతో కలిసి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నేడు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

click me!