
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఆర్జేడీ సీనియర్ నేత, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్ కుమారుడైన ఆయప సోమవారం మీడియాతో మాట్లాడారు. నితీష్ కుమార్ ను ‘శిఖండి’(మహాభారతంలోని ఓ పాత్ర) తో పోల్చారు. నితీష్ కుమార్ వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, ఆ బాధ్యతలను తేజస్వీ యాదవ్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయికి కనిష్ట ఉష్ణోగ్రతలు.. దట్టమైన పొగమంచు.. : ఐఎండీ
‘నితీష్ రాజీనామా చేసిన తర్వాత ప్రజలు ఆయనను గుర్తుంచుకోరు. నితీష్ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. మాజీ ముఖ్యమంత్రులు కృష్ణ సిన్హా, కర్పూరి ఠాకూర్ వంటి వ్యక్తులు బీహార్ కు ఎంతో చేశారు. వారి సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. రాష్ట్రానికి ఎంతో చేసిన మా నాయకుడు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ జీ విషయంలో కూడా ఇదే జరిగింది. కానీ నితీష్ కుమార్ పేరు చరిత్రలో ఉండదు. అతడిని అస్సలు గుర్తుంచుకోరు. ఆయన శిఖండి లాంటివాడు, అతడికి సొంత హోదా లేదు’’ అని సుధాకర్ సింగ్ అన్నారు.
ఉత్తరప్రదేశ్ లో దారుణం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. మృతదేహంపై నుంచి వెళ్లిన వందల వాహనాలు..
వ్యవసాయ శాఖలో అవినీతి జరిగిందంటూ నితిష్ కుమార్ పదే పదే వ్యాఖ్యలు చేయడంతో ఆయన తన రాష్ట్ర వ్యవసాయ మంత్రి పదవికి 2022 అక్టోబర్ లో రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. అయితే తాజాగా సీఎంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ వివాదాన్ని రేకెత్తించాయి. ‘‘ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. ఇది రాష్ట్రంలోని మహాఘట్ బంధన్ ప్రభుత్వంలోని అన్ని కూటమి భాగస్వాముల ఐక్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కావాలనే సీఎంపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో సుధాకర్ కు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే’’ అని ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ అన్నారు.
తమిళనాడు కడలూరులో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఆర్జేడీ ఎమ్మెల్యే చేసిన ప్రకటన ఆమోదయోగ్యం కాదని జేడీయూ జాతీయ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా అన్నారు. ఇది మర్యాదను ఉల్లంఘించే ప్రయత్నంగా ఉందని తెలిపారు. నితీష్ రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు తెలుసునని కుష్వాహి ట్వీట్ చేశారు. నితీష్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న సాహసోపేతమైన చర్యలకు ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.