దారుణం... ఆవుపై అత్యాచారం..!

Published : Jan 03, 2023, 10:24 AM IST
దారుణం... ఆవుపై అత్యాచారం..!

సారాంశం

ఏం జరిగిందా అని స్థానిక వ్యవసాయ కూలీలు అక్కడకు వెళ్లి చూశారు. అక్కడ దృశ్యం చూసి వారు షాకయ్యారు. అందులో వ్యక్తి... ఆవుపై అత్యాచారానికి పాల్పడుతూ కనిపించాడు.

కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వ్యక్తి..... నోరులేని పశువు అనే కనికరం లేకుండా... ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన కేరళ రాష్ట్రంలో  చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళ రాష్ట్రంర కొల్లం జిల్లా లో అర్థరాత్రి ఓ  వ్యక్తి గోశాలలోకి ప్రవేశించి ఆవుపై అత్యాచారానికి పాల్పడటం గమనార్హం. గోశాలలోని ఆవులు అరుపులు వినపడగా... ఏం జరిగిందా అని స్థానిక వ్యవసాయ కూలీలు అక్కడకు వెళ్లి చూశారు. అక్కడ దృశ్యం చూసి వారు షాకయ్యారు. అందులో వ్యక్తి... ఆవుపై అత్యాచారానికి పాల్పడుతూ కనిపించాడు.

కూలీలు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు గోడ దూకి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు కూలీలు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని మణిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆవుపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కస్టడీకి పంపారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !