తమిళనాడు సర్కారు బడ్జెట్లో రూపాయి గుర్తును మార్చిన అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. డీఎంకే తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు..
తమిళనాడు ప్రభుత్వం 2025-26 బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తు ‘₹’ను తమిళ అక్షరం ‘ரு’ (రు)తో మార్చింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఇది దేశ సమైక్యతను దెబ్బతీసేలా ఉందని, ప్రాంతీయ గర్వం పేరుతో వేర్పాటు వాదానికి ఊతం ఇచ్చేలా ఉందని అన్నారు. ఈ మార్పుపై డీఎంకే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే శుక్రవారం ఉదయం రాబోయే రాష్ట్ర బడ్జెట్ ప్రచార మెటీరియల్‌లో దేవ నాగరి రూపాయి గుర్తు (₹)ను తమిళ అక్షరం 'రు'తో మార్చింది. దీంతో డీఎంకేకు విపరీతమైన రాజకీయ వ్యతిరేకత ఎదురైంది. దేశం గుర్తించిన రూపాయి గుర్తును డీఎంకే మాజీ ఎమ్మెల్యే కొడుకు 'డ్రామా'గా మార్చేశారని రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.అన్నామలై అన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీని 'మూర్ఖులు' అని తిట్టారు. అంతేకాదు, ఈ మార్పు రాజ్యాంగానికి వ్యతిరేకమని మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు.
సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆర్థిక మంత్రి
ఆమె మాట్లాడుతూ.. రూపాయి గుర్తు '₹'కు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉందని, ప్రపంచ ఆర్థిక లావాదేవీల్లో ఇది మన దేశానికి ప్రత్యేక గుర్తింపు అని అన్నారు. యూపీఐ ద్వారా సరిహద్దు చెల్లింపులపై భారత్ ఫోకస్ పెట్టినప్పుడు.. మన సొంత జాతీయ కరెన్సీ గుర్తును తక్కువ చేయాలా అని ప్రశ్నించారు. డీఎంకేకు '₹'తో సమస్య ఉంటే.. 2010లో యూపీఏ సర్కారు అధికారికంగా ఆమోదించినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. అప్పుడు డీఎంకే కేంద్రంలో అధికార కూటమిలో భాగమని గుర్తు చేశారు.
நாளை தாக்கல் செய்யப்படும் தமிழ்நாடு பட்ஜெட் 2025-26 ஆவணங்களில் இருந்து அதிகாரப்பூர்வ ரூபாய் சின்னமான '₹' ஐ நீக்கியுள்ளதாக திமுக அரசு அறிவித்துள்ளது.
திமுகவிற்கு () உண்மையிலேயே '₹' உடன் பிரச்சனை இருந்தால், 2010 ஆம் ஆண்டு தலைமையிலான ஐக்கிய முற்போக்கு…
— Nirmala Sitharaman (@nsitharaman)
గురువారం సాయంత్రం ఆర్థిక మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేసి తన రియాక్షన్ తెలిపారు. అందరూ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారని, రాష్ట్ర బడ్జెట్ పత్రాల నుంచి 'రూపాయి' వంటి జాతీయ చిహ్నాన్ని తొలగించడం జాతీయ సమైక్యతను దెబ్బతీస్తుందని అన్నారు. తమిళనాడు బడ్జెట్ 2025-26లో రూపాయి గుర్తును డీఎంకే సర్కారు తొలగించిందని ఫైర్ అయ్యారు.