UP Elections 2022: బీఎస్పీలో చేరిన నిర్భయ లాయర్ సీమా కుష్వాహ

By Rajesh KFirst Published Jan 21, 2022, 12:44 PM IST
Highlights

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. తాజాగా గురువారం  నిర్భయ, హత్రాస్ రేప్ కేసుల్లో బాధితుల తరపున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా కుష్వాహ తాజాగా బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. 
 

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ స‌మీపిస్తున్న‌ కొద్దీ..  పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఈ త‌రుణంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్న దృష్ట్యా పలు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు టికెట్ల కోసం పార్టీలు మారుతున్నారు. తాజాగా గురువారం  నిర్భయ, హత్రాస్ రేప్ కేసుల్లో బాధితుల తరపున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా కుష్వాహ తాజాగా బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. 

లక్నోలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా సమక్షంలో సీమా కుష్వాహా బీఎస్పీలో చేరారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేందుకే పార్టీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీమా కుశ్వాహా చేరిక బీస్పీకి మరింత బలాన్ని ఇస్తుందని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తోన్నారు. దేశాన్ని కుదిపేసిన నిర్భయ, హత్రాస్ లాంటి కేసుల్లో బాధితుల తరపున కోర్టు ముందు వాదనలు వినిపించిన సీమా పార్టీలోకి చేరడం వల్ల మహిళల్లో మరింత ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 

ఇంతకీ సీమా కుష్వా ఎవరు?
సీమా కుశ్వాహా, ఉత్తరప్రదేశ్‌లోని ఈటీవా జిల్లా బిదిపూర్ గ్రామంలో 1982 జనవరి 10న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రాంకున్రి కుశ్వాహా, బలదిన్ కుశ్వాహా. వీరికి ఆరుగురు ఆడపిల్లలు. అందులో సీమా నాలుగవ కూతురు. సీమా కుష్వాహా సుప్రీంకోర్టు న్యాయవాది. 2012లో ఢిదేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ కేసులో బాధితురాలు త‌రుపున వాదించి.. ఆ కేసును గెలిచి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌ను గడించింది. అలాగే..  హత్రాస్ రేప్ కేసు బాధితుల తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. అలాగే నిర్భయ జ్యోతి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి.. అత్యాచార బాధితులకు న్యాయం జరిగేలా ప్రచారాన్ని చేపట్టారు.

బీఎస్పీ అభ్యర్థుల జాబితా విడుదల.. ఫిబ్రవరి 10న జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత అభ్యర్థుల పేర్లను మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ బుధవారం ప్రకటించింది. గత వారం 53 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది.
 

click me!