చివరి కోరికపై మౌనంగా నిర్భయ దోషులు.. ఎందుకంత ధీమా?

By telugu teamFirst Published Jan 23, 2020, 11:13 AM IST
Highlights

ఉరి తేదీ  దగ్గరపడుతుండటంతో చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు నలుగురు దోషులను ప్రశ్నించారు. అయితే...వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని తీహార్  జైలు అధికారులు తెలిపారు.


ఎంతంటి కఠినాత్ముడైనా... ఎలాంటి ఘోరం చేసినా... ఉరిశిక్ష వేసేముందు అతని చివరి కోరిక తీర్చడం ఎన్నో సంవత్సరాలుగా మన న్యాయస్థానం ఆచరిస్తూ వస్తున్న ధర్మం.  ఇప్పుడు చివరి కోరిక చెప్పడం నిర్భయ దోషుల వంతయ్యింది. 

దాదాపు ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆమె చావుకు కారణమైన నలుగురు దోషులకు ఉరి సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆ నలుగురు దోషులను న్యాయస్థానం ఉరితో శిక్షించనుంది. వీరి ఉరికి తీహార్ జైల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అయితే... ఉరి తేదీ  దగ్గరపడుతుండటంతో చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు నలుగురు దోషులను ప్రశ్నించారు. అయితే...వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని తీహార్  జైలు అధికారులు తెలిపారు.

Also Read ఒక్కేసారి కాదు, ఒకరి తర్వాత ఒక్కరిని ఉరి తీయండి: నిర్భయ తల్లి...

నిబంధనల ప్రకారం మరణశిక్ష పడిన దోషులు చివరి కోరికగా తమ కుటుంబసబ్యులను కలుసుకోవాలని అడిగే అవకాశం ఉంది. వారి ఆస్తులను తమకు ఇష్టమైనవారికి ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే.. ఈ రెండు విషయాలపై జైలు అధికారులు నిర్భయ దోషులను అడగగా... వారు మౌనంగా ఉన్నారట. అయితే... వాళ్ల మౌనానికి కారణం లేకపోలేదని జైలు అధికారులు చెబుతున్నారు.

నిజానికి వాళ్లకు ఇప్పటికే ఉరిశిక్ష పడాల్సి ఉంది. కానీ పలు కారణాలను చూపించి.. కోర్టులో కేసుల మీద కేసులు వేస్తూ ఉరిశిక్షను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి కూడా ఉరి వాయిదా పడుతుందని వారు ధీమా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చివరి కోరిక ఏంటని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పలేదని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించనున్నారు. 

click me!