అత్యాచారం చేశాడన్న మహిళ.. నిజమే కానీ నిర్దోషంటున్న కోర్టు

By telugu teamFirst Published Jan 23, 2020, 10:45 AM IST
Highlights

ఆమె ఎక్కడ ఉందో కనుక్కున్న ఆమె భర్త.. ఢిల్లీ కూడా వచ్చాడు. తాను మారిపోయానని ఆమెకు మాయ మాటలు చెప్పి తనతో కలిసి ఉండమని ప్రాథేయపడ్డారు. నిజమే అనుకొని అతనిని ఆమె నమ్మింది. ఈ క్రమంలో ఆమె దాచుకున్న రూ.2లక్షలు తీసుకొని పరారయ్యాడు. దీంతో ఆమెకు ఈసారి భర్త అంటే అసహ్యం వేసింది. 

అతను తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంతో ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. అతను కూడా తాను నేరం చేశానని అంగీకరించాడు. కానీ న్యాయస్థానం మాత్రం అతను నిర్దోషి అంటూ తీర్పు ఇచ్చింది. నిందితుడిని విడుదల కూడా చేశారు. అందుకు కారణం లేకపోలేదు.. సదరు నిందితుడు.. బాధితురాలికి భర్త కావడమే. ఆ ఒక్క కారణంతో అతనిని న్యాయస్థాన నిర్దోషిగా ప్రకటించింది. ఈ సంఘటన  ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పంజాబ్ కి చెందిన ఓ మహిళకు 2015లో వివాహమైంది. కొద్దికాలం పాటు వారి సంసారం బాగానే సాగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకు తన భర్త ఓ దొంగ అన్న విషయం ఆమెకు తెలిసింది. ఆ నిజం తట్టుకోవడం ఆమెకు కష్టంగా అనిపించింది. అలాంటి వ్యక్తితో ఇక తాను కలిసి ఉండలేనని భావించింది. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోయి ఒంటరిగా జీవిస్తోంది.

అయితే... ఆమె ఎక్కడ ఉందో కనుక్కున్న ఆమె భర్త.. ఢిల్లీ కూడా వచ్చాడు. తాను మారిపోయానని ఆమెకు మాయ మాటలు చెప్పి తనతో కలిసి ఉండమని ప్రాథేయపడ్డారు. నిజమే అనుకొని అతనిని ఆమె నమ్మింది. ఈ క్రమంలో ఆమె దాచుకున్న రూ.2లక్షలు తీసుకొని పరారయ్యాడు. దీంతో ఆమెకు ఈసారి భర్త అంటే అసహ్యం వేసింది. ఇదిలా ఉండగా మరో దొంగతనం కేసులో అతను అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి... మళ్లీ భార్య దగ్గరకు వచ్చాడు. ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు  చేసింది. 

 దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. ఈ కేసును విచారించిన న్యాయస్థానం... వాళ్లిద్దరూ చాలారోజుల పాటు కలిసే ఉన్నారని.. కేవలం డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తడంతోనే ఇప్పుడు బాధితురాలు కేసు నమోదు చేసిందని పేర్కొంది. ఆమె ఇష్టప్రకారమే అతడితో శారీరక సంబంధానికి సమ్మతించిందని తన మాటల ద్వారా అర్థమైందని.. కాబట్టి అతడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 

Also Read ‘ఆయనకు ఇద్దరు’.. భర్తను చెరో మూడు రోజులు పంచుకున్న భార్యలు.. మరి ఆదివారం?..

కాగా ఈ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం గతంలో పేర్కొన్న అంశాలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. దీనిని వైవాహిక అత్యాచారంగా పరిగణించవచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారు.

కాగా... భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. డబ్బులు ఇస్తానని చెప్పి భార్యను లోబరుచుకునేవారు చాలా మంది ఉన్నారు. అప్పుడు అంగీకరించి ఆ తర్వాత దానిని అత్యాచారం గా కోర్టుకి ఎక్కే మహిళలు ఉన్నారని... ఇది కూడా అలాంటిదేనని అభిప్రాయపడటం గమనార్హం. సదరు మహిళ తనపై అత్యాచారం జరిగిందని చెప్పుకునే సమయానికి ఆమె నిందితుడికి భార్యగానే ఉందని.. అందుకే దానిని రేప్ గా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితుడిని విడుదల  చేసింది. 

click me!