మూడు రాజధానులకు కేంద్రం అనుమతి లేదు:పవన్ కళ్యాణ్

Published : Jan 23, 2020, 10:47 AM ISTUpdated : Jan 30, 2020, 06:47 PM IST
మూడు రాజధానులకు  కేంద్రం అనుమతి లేదు:పవన్ కళ్యాణ్

సారాంశం

పాలనా వికేంద్రీకరణ బిల్లుపై  కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. 

అమరావతి: ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని జనసేన చీప్ పవన్ కళ్యాణ్ చెప్పారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఉదయం బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్  మీడియాతో మాట్లాడారు.

ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అనుమతితోనే మూడు రాజధానులను తీసుకొస్తున్నట్టుగా వైసీపీ చేస్తున్న ప్రచారం సరైందికాదన్నారు.ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ సునీల్ దియోధర్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఈ విషయం కూడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకురాగా అలాంటిదేమీ లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ రకమైన చర్చ  తమ వద్ద వైసీపీకి చెందిన నేతలు ఎవరూ కూడ తీసుకు రాలేదని  ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాలు సునీల్ ధియోధర్‌ల ద్వారా  తమకు చేరవేశారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 తమ భూదందాల కోసమే వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని  తెరమీదికి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజధాని రైతులకు మద్దతుగా  ఫిబ్రవరి రెండో తేదీన  లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్టుగా వవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నెల రెండో తేదీన  నిర్వహించే లాంగ్ మార్చ్‌ను విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ జనసేన, బీజేపీ కార్యకర్తలను కోరారు.


 

PREV
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?