నేను ఆ రోజున ఢిల్లీలోనే లేను.. నాకు ఉరేలా వేస్తారు: కోర్టుకెక్కిన నిర్భయ దోషి

By Siva KodatiFirst Published Mar 17, 2020, 2:37 PM IST
Highlights

ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ కోర్టుకు ఎక్కిన వీరు.. తాజాగా ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు

ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ కోర్టుకు ఎక్కిన వీరు.. తాజాగా ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read:తేదీలు మారతాయేమో అంతే.. శిక్ష తప్పదు: నిర్భయ తల్లి వ్యాఖ్యలు

నిర్భయ ఘటన జరిగిన డిసెంబర్ 16న తాను ఢిల్లీలోనే లేనని దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ పిటిషన్‌ పేర్కొన్నాడు. తనను డిసెంబర్ 17, 2012న రాజస్ధాన్ నుంచి పోలీసులు ఢిల్లీ తీసుకొచ్చి , తీహార్ జైలులో చిత్రహింసలకు గురిచేశారని అతను ఆరోపించాడు. ఈ క్రమంలో తన మరణశిక్షను రద్దు చేయాలంటూ పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ముందు తన పిటిషన్ దాఖలు చేశాడు.

కాగా నిర్భయ దోషులు నలుగురిని ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని మార్చి 5న ప్రత్యేక కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరణశిక్షను వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు అక్షయ్ కుమార్ , పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ రావడంతో ఉరి మూడు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Also Read:నిర్భయ కేసులో కొత్త ట్విస్ట్: ఉరిశిక్షపై అంతర్జాతీయ కోర్టుకెక్కిన దోషులు

కాగా తనకున్న చట్టపరమైన పరిష్కార మార్గాలను పునరుద్దరించాల్సిందిగా కోరుతూ దోషి ముకేశ్ సింగ్ దాఖలు చేసిన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. 

click me!