నిర్భయ కేసులో మరో ట్విస్ట్: ఉరిపై స్టే కోరుతూ కోర్టుకెక్కిన దోషులు

By telugu teamFirst Published Mar 19, 2020, 9:26 AM IST
Highlights

నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ వారి తరఫు న్యాయవాది కోర్టుకెక్కారు. నలుగురు దోషులకు రేపు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది.

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని కోరుతూ వారి తరఫు న్యాయవాది బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. దోషుల్లోని ఒక్కడి రెండో విడత మెర్సీ పిటిషన్ పెండింగులో ఉండడంతో ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ పై అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా తీహార్ జైలు అధికారులకు, పోలీసులకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్ పై నేడు గురువారం విచారణ చేపట్టనున్నారు. 

Also Read: నిర్భయ దోషులకు ఉరి.... తలారికి ఎంతిస్తున్నారంటే.....

నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన అక్షయ్ సింగ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రెండోసారి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. నేరం జరిగినప్పుడు తాను మైనర్ ను అంటూ పెట్టుకున్న పిటిషన్ ను తోసిపుచ్చడంపై మరో దోషి పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. 

దోషులు ముకేష్ సింగ్ (32), పవన్ (25), వినయ్ శర్మ (26), అక్షయ్ (31) లకు మార్చి 20వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాలని పాటియాల హౌస్ కోర్టు మూడోసారి డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. 

Also Read: కొత్త డ్రామా: విడాకులు కోరిన నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ భార్య

2012 డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ కేసులో ఒకతను మైనర్ కావడంతో శిక్ష అనుభవించి బయటపడ్డాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

click me!