కరోనా: మలేషియా నుండి స్వదేశానికి 250 మంది తెలుగు విద్యార్థులు

By narsimha lode  |  First Published Mar 18, 2020, 5:21 PM IST

మలేషియాలో చిక్కుకొన్న తెలుగు విద్యార్థులు స్వదేశానికి బయలుదేరారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో  చిక్కుకొన్న విద్యార్థులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


న్యూఢిల్లీ: మలేషియాలో చిక్కుకొన్న తెలుగు విద్యార్థులు స్వదేశానికి బయలుదేరారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో  చిక్కుకొన్న విద్యార్థులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

కరోనా వైరస్ కారణంగా పలు దేశాలకు విమానాలను రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. దీంతో కౌలాంపూర్ విమానాశ్రయం నుండి ఇండియాకు వచ్చే విమానాలు రద్దు కావడంతో తెలుగు విద్యార్థులు  మలేషియాలోనే చిక్కుకొన్నారు.

Latest Videos

undefined

Also read:'చికెన్‌తో కరోనా అని నిరూపిస్తే రూ. 5 కోట్ల బహుమతి'

కౌలాలంపూర్  తో పాటు మనీలా విమానాశ్రయాల్లో సుమారు రెండు వందలకు పైగా విద్యార్థులు చిక్కుకొన్నారు. ఇక్కడ చిక్కుకొన్న విద్యార్థులను బుధవారం నాడు స్వదేశానికి  బయలు దేరారు.

హైద్రాబాద్, వరంగల్,  విశాఖపట్టణం, తూర్పు గోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు మనీలా, కౌలాలంపూర్ విమానాశ్రయాల నుండి స్వదేశానికి బయలు దేరారు.

కౌలాలంపూర్ విమానాశ్రయం నుండి ఢిల్లీ, విశాఖపట్టణాలకు ఎయిర్ ఏషియా విమానాలను అనుమతిస్తున్నట్టుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. బుధవారం నాడు కౌలాలంపూర్ విమానాశ్రయం నుండి విద్యార్థులు ఇండియాకు బయలుదేరారు.
 

click me!