ఒమిక్రాన్ ఎఫెక్ట్: పంజాబ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు

By narsimha lodeFirst Published Jan 4, 2022, 11:05 AM IST
Highlights

పంజాబ్ రాష్ట్రంలోని రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నారు. స్కూల్స్, కాలేజీలను జనవరి 15 వరకు మూసివేయనున్నారు.

చండీఘడ్: corona ఒమిక్రాన్  కేసులు పెరిగిపోవడంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం  రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకొంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు  చేయనున్నారు.

స్కూల్స్, కాలేజీలు మూసివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.  ఈ నెల 15 వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలను మూసివేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా Omicron కేసులు  పెరిగిపోతున్న నేపథ్యంలో రాత్రిపూట curfew  విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం Charanjit singh అధ్యక్షతన మంగళవారం నాడు సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశం తర్వాత రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

also read:coronavirus: భార‌త్ లో క‌రోనా క‌ల్లోలం..37 వేల‌కు పైగా కొత్త కేసులు.. 1892 ఒమిక్రాన్ కేసులు..

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు స్కూల్స్, కాలేజీలు సహా అన్ని విశ్వవిద్యాలయాల్లో  ఆఫ్‌లైన్ తరగతులు నిషేధించారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలు యధావిధిగా పనిచేసేందుకు అనుమతించారు.

బార్‌లు, సినిమా హాల్స్, మల్టీఫ్లెక్స్‌లు, మాల్స్, రెస్టారెంట్స్ , స్పాలు, మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు 50 శాతం సామర్ధ్యంతో పనిచేయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆంక్షలు ఈ నెల 15వ తేదీవరకు అమల్లో ఉంటాయని  ప్రభుత్వం తెలిపింది.

క్రీడా సముదాయాలు, స్టేడియాలు, స్మిమ్మింగ్ పూల్స్, జిమ్ లను మూసివేశారు. జాతీయ, అంతర్జాతీయ ఈవెంటల్లో శిక్షణ పొందే క్రీడాకారులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. పూర్తిగా వ్యాక్సి్ వేసుకొన్న సిబ్బంది మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు హాజరు కావాలని ఆ ఉత్తర్వులో ప్రభుత్వం తెలిపింది.

పంజాబ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 28న 51 కేసులు నమోదైతే నిన్న419 కేసులు నమోదయ్యాయి. పంజాబ్ రాష్ట్రంలోని పాటియాల మెడికల్ కాలేజీలో కరోనా విజృంభించింది. మెడికల్ కాలేజీకి చెందిన 100 మంది విద్యార్ధుల కోసం కరోనా సోకింది. దీంతో విద్యార్ధులను ఐసోలేషన్ కు తరలించారు.

 తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఇటీవల తనను కలిసివారంతా  జాగ్రత్తగా ఉండాలని  టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 

గ‌త 24 గంటల్లో దేశంలో 37,379 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా వైర‌స్ కేసులు 3,49,60,261 కు చేరాయి. క్రియాశీల కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా 11 వేల మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్‌-19 రిక‌వ‌రీల సంఖ్య 3,43,06,414కు పెరిగింది. దాదాపు 117 రోజుల త‌ర్వాత అత్య‌ధికంగా ఒక‌రోజు కోవిడ్ కేసులు ఇవేన‌ని గ‌ణాకాంలు పేర్కొంటున్నాయి

click me!