పంజాబ్ లో కరోనా కలకలం.. పాటియాల మెడికల్ కాలేజీలో వందమంది విద్యార్థులకు పాజిటివ్...

By SumaBala BukkaFirst Published Jan 4, 2022, 9:50 AM IST
Highlights

పంజాబ్ పాటియాల మెడికల్ కాలేజీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏకంగా 100 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మెడికల్ కాలేజ్ కరోనా హాట్ స్పాట్ గా మారింది. పాట్నాలోని పాటియాలా మెడికల్ కాలేజీకి చెందిన 100 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ గా తేలారని కేబినెట్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా  ధృవీకరించారు.

పంజాబ్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతూ థార్ధ్ వేవ్ సంకేతాలను స్పష్టంగా కళ్లముందుంచుతున్నాయి. కాలేజీలు, స్కూళ్లు, కార్యాలయాలలో వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. 

తాజాగా పంజాబ్ Patiala Medical Collegeలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఏకంగా 100 మంది Medical studentsకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మెడికల్ కాలేజ్ కరోనా Hot spot గా మారింది. పాట్నాలోని పాటియాలా మెడికల్ కాలేజీకి చెందిన 100 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ గా తేలారని కేబినెట్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా  ధృవీకరించారు.

దీంతో మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులందరూ వెంటనే తమ గదులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.

coronavirus: మ‌హారాష్ట్రలో మ‌ళ్లీ మొద‌లు.. క‌రోనా పంజాతో స్కూల్స్ క్లోజ్

కాగా, నెల్లూరు, Sriharikotaలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో Corona కలకలం చెలరేగింది. ఇద్దరు వైద్యులతో సహా 12 మందికి పాజిటివ్ వచ్చింది. షార్ లో గత నెల 27వ తేదీ నుంచి వరుసగా కేసులు నమోదవుతున్నాయి. Omicron అయి ఉండొచ్చనే అనుమానంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. 

అంతేకాదు షార్ లో కరోనా Third wave ప్రారంభమయ్యిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం 12 మందికి పాజిటివ్ గా తేలడంతో షార్ యాజమాన్యం ఉలిక్కిపడింది. వీరిలో ఇద్దరు వైద్యులు ఉండటం విశేషం. సూళ్లూరుపేటలోని షార్ ఉద్యోగుల కేఆర్పీ, డీఆర్ డీఎల్ లలో ఒక్కొక్కరు, సూళ్లూరుపేట శివార్లలో మరో షార్ విశ్రాంత ఉద్యోగికి కరోనా సోకడంతో సూళ్లూరుపేటలో కూడా కరోనా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్..

దీంతోపాటు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఇటీవల తనను కలిసివారంతా  జాగ్రత్తగా ఉండాలని , టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 

‘నాకు కోవిడ్ 19 పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. అందుకే స్వయంగా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసినవారు. నాతో దగ్గరగా మెలిగినవారు టెస్టులు చేయించుకోండి. సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. 

click me!