రైలు పేల్చేందుకు కుట్ర: దర్భాంగా పేలుడులో కీలక విషయాలు

By narsimha lodeFirst Published Jun 30, 2021, 12:28 PM IST
Highlights

బీహార్‌లోని దర్భాంగా పేలుడు ఘటనపై విచారణలో కీలక విషయాలను ఎన్ఐఏ గుర్తించింది. రైలును పేల్చేందుకు దుండగులు కుట్రపన్నారని గుర్తించారు.

హైదరాబాద్: బీహార్‌లోని దర్భాంగా పేలుడు ఘటనపై విచారణలో కీలక విషయాలను ఎన్ఐఏ గుర్తించింది. రైలును పేల్చేందుకు దుండగులు కుట్రపన్నారని గుర్తించారు.బీహార్ లోని దర్బాగం ర్వైల్వేస్టేషన్ లో ఈ నెల 17వ తేదీన పేలుడు వాటిల్లింది. ఈ పేలుడుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి వచ్చిన పార్శిల్ కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ పేలుడుపై ఉగ్రకోణంపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించారు.  ఇప్పటికే యూపీకి చెందిన ఇద్దరితో పాటు హైద్రాబాద్ కు చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తోంది.

also read:దర్భంగాలో పేలింది.. హైదరాబాద్ బాంబే??

బీహార్ రాష్ట్రానికి చెందిన ఇమ్రాన్, నసీర్ లు హైద్రాబాద్ లో రెడీమెడ్ దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. చాలా కాలం క్రితం వారు హైద్రాబాద్ కు వచ్చారు. సుఫియాన్ అర్షద్ పేరుతో సికింద్రాబాద్ లో పార్శిల్ బుక్ చేశారు. దర్బాంగాలో రైల్వేస్టేషన్ ను పేల్చేయాలని కుట్రపన్నారని  ఎన్ఐఏ గుర్తించింది. ఈ రైలును పేల్చివేయడం ద్వారా భారీగా ఆస్తి, ప్రాణనష్టం చేయాలని ప్లాన్ చేశారని ఎన్ఐఏ గుర్తించింది.దర్భాంగా రైల్వేస్టేషన్ లో పేలుడు చోటు చేసుకొన్న సమయంలోనే అర్షద్  ఇదే రైల్వేస్టేషన్ లో ఉన్నాడని ఎన్ఐఏ గుర్తించింది. అర్షద్ దొరికితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి  వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అర్షద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
 

click me!