మావోయిస్టు అగ్రనేత హిడ్మాపై రూ. 7 లక్షల రివార్డు: ఎన్ఐఏ

Published : Apr 18, 2021, 04:33 PM ISTUpdated : Apr 18, 2021, 04:41 PM IST
మావోయిస్టు అగ్రనేత హిడ్మాపై రూ. 7 లక్షల రివార్డు: ఎన్ఐఏ

సారాంశం

మావోయిస్ట్ అగ్రనేత  హిడ్మా ఆచూకీ తెలిపితే  రూ. 7 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. మావోయిస్టు పార్టీ పీపుల్సీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి హిడ్మా నాయకత్వం వహిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

రాయ్‌పూర్ : మావోయిస్ట్ అగ్రనేత  హిడ్మా ఆచూకీ తెలిపితే  రూ. 7 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. మావోయిస్టు పార్టీ పీపుల్సీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీకి హిడ్మా నాయకత్వం వహిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.ఈ నెల 3వ తేదీన బీజాపూర్ జిల్లాలోని సుక్మా వద్ద  జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్లు మరణించారు  భద్రతా దళాలపై వ్యూహాత్మక దాడికి హిడ్మా కీలక సూత్రధారిగా పోలీసులు పేర్కొంటున్నారు.

ఛత్తీస్‌ఘడ్ ఎమ్మెల్యే భీమా మాండవి హత్యకు సంబంధించి 2019 కేసులో  రూ. 7 లక్షల రివార్డు హిడ్మాపై ఉంది.  బీజాపూర్ లో కోబ్రా కమాండో దళాలపై  దాడి జరిగిన తర్వాత ఎన్ఐఏ నేతృత్వంలో బృందం ఛత్తీ‌స్‌ఘడ్ ను సందర్శించింది.   డీఐజీ ర్యాంక్ అధికారి ఈ బృందానికి నాయకత్వం వహించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై జరిగిన దాడిలో కూడ హిడ్మా కీలకపాత్ర పోషించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.  ఛత్తీస్‌ఘడ్ లో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా హిడ్మా చేస్తున్నారు.. హిడ్మాపై ఇప్పటికే  రూ. 40 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది.


 

PREV
click me!

Recommended Stories

Traffic Rules: వాహ‌నాల‌పై కులం పేర్లు రాసుకుంటే రూ. 2 వేలు ఫైన్‌.. ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం
TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu