రోజూ కూలీని వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు

Siva Kodati |  
Published : Apr 18, 2021, 04:09 PM IST
రోజూ కూలీని వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు

సారాంశం

అదృష్టం ఎవరినీ, ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకున్నవాడే అదృష్టవంతుడవుతాడు. అలాంటి వారినే అదృష్ట దేవత వరించింది

అదృష్టం ఎవరినీ, ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకున్నవాడే అదృష్టవంతుడవుతాడు. అలాంటి వారినే అదృష్ట దేవత వరించింది.

తాజాగా ఓ కూలీ రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లా అకోటా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బోదరాజు అనే కూలీ రూ.100 పెట్టి కొన్న లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది.

ఏప్రిల్‌ 14న బోదరాజు రూ.100 పెట్టి లాటరీ టికెట్‌ కొన్నాడు. లూథియానాలో న్యాయనిర్ణేతల సమక్షంలో జరిగిన డ్రాలో బోదరాజు కొన్న లాటరీని అదృష్టం వరించింది. ఈ విషయాన్ని లాటరీల నిర్వాహకుడు అశోక్‌.. బోదరాజుకు తెలియజేశాడు.

ప్రైజ్ మనీ త్వరలో అందిస్తామని వెల్లడించాడు. తనకు ఈ అదృష్టం దక్కడం పట్ల బోదరాజు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ ఆనందాన్ని భార్య, ఇద్దరు కూతుళ్లతో పంచుకున్న బోదరాజు.. లాటరీ డబ్బుతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని పేర్కొన్నాడు.  

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం