కరోనా ఎఫెక్ట్: ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షల వాయిదా

By narsimha lodeFirst Published Apr 18, 2021, 12:15 PM IST
Highlights

కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ మాసంలో నిర్వహించాల్సిన  ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశారు. 

న్యూఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ మాసంలో నిర్వహించాల్సిన  ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశారు. ఐఐటీ జేఈఈ మెయిన్స్  ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను  ఈ నెల 27 నుండి  30 వరకు నిర్వహించాలని  తొలుత కేంద్రం నిర్ణయం తీసుకొన్నారు.  

 

👉Please note: The dates of JEE (Main) – 2021 April session will be announced later on and at least 15 days before the examination.

— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank)

అయితే కరోనా  కేసులు పెరిగిపోవడంతో  ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర విద్యశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ ఆదివారం నాడు ప్రకటించారు. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహస్తామనే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు.  పరీక్షలకు కనీసం 15 రోజుల ముందు తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.


 

click me!